విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే ఇంటూరి

BSBNEWS - కందుకూరు
కందుకూరు పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఇటీవల విడుదలైన పదవ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన కందుకూరు శ్రీ చైతన్య హైస్కూలు విద్యార్థులు రామాల వైష్ణవి (593), ద్వితీయ స్థానము సాధించిన గుర్రం ముఖేష్ (592) లను ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విద్యార్థులతో మాట్లాడుతూ భవిష్యత్తులో చదివే ఉన్నత చదువులలో కూడా అత్యుత్తమ ప్రదర్శన కనపరచాలని చదువుకున్న విద్యాసంస్థలకు తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమములో చైతన్య విద్యాసంస్థల ఆర్ ఐ అనిల్ కుమార్, కో ఆర్డినేటర్ శ్రీనివాస రావు, ప్రిన్సిపల్ బి.సురేష్, డీన్ బ్రహ్మయ్య, సి బ్యాచ్ ఇంచార్జి శివయ్య, ఏవో సురేష్ నాయుడు, విద్యార్థుల తల్లితండ్రులు తదితరులు పాల్గొన్నారు.