కులమత రాజకీయాలు పక్కన పెట్టి అందరం ఏకమవుదాం - నరేంద్ర మోడీకి మేమంతా వెనుక ఉన్నాం - ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి

0

కులమత రాజకీయాలు పక్కన పెట్టి అందరం ఏకమవుదాం 

-  నరేంద్ర మోడీకి మేమంతా వెనుక ఉన్నాం

 - ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి

BSBNEWS - KAVALI



కశ్మీర్ఉగ్రవాద ఘటనలో మరణించిన కావలి నివాసి మధుసూదన్ భౌతిక కాయానికి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, కలెక్టర్ ఆనంద్ లు నివాళులు అర్పించి కుటుంబ సభ్యులని పరామర్శించారు. కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మీడియాతో మాట్లాడుతూ కశ్మీర్ ఉగ్రవాద ఘటన పిరికిపంద చర్య అని, పేద కుటుంబానికి చెందిన మధుసూదన్ మృతి చెందడం దురదృష్టకరం అని అన్నారు. మధ్యాహ్నం జరిగే అంతిమ యాత్రలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు ఆనం, సత్య కుమార్, నాదెండ్ల మనోహర్ హాజరవుతారన్నారు. పట్టణంలో ప్రజల నీరాజనాల మధ్య అంతిమయాత్ర నిర్వహిస్తామన్నారు. ఒక మంచి వ్యక్తిని కోల్పోయామని మధుసూదన్ అందరివాడు అని అన్నారు. ఆ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామన్నారు. బిడ్డల కళ్ళముందే ఇలాంటి ఘటన జరిగటం విషాదకరమన్నారు. భారతీయులందరూ దేశానికి మద్దతు పలకాలన్నారు. కులమత రాజకీయాలు పక్కన పెట్టి అందరం ఏకమవుదాం అని పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీకి మేమంతా వెనుక ఉన్నాం అని, మోడీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ప్రజలందరూ అండగా నిలబడుతామన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)