ఘనంగా జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం
BSBNEWS - కందుకూరు
గురువారం మండలంలోని కోవూరు గ్రామ సచివాలయంలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా గ్రామసభను సర్పంచ్ ఆవుల మాధవరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాధవరావు మాట్లాడుతూ గాంధీజీ కలలుకన్న గ్రామ స్వరాజ్యం దిశగా పల్లె ప్రగతి దేశానికి ప్రగతి అని, ప్రజాస్వామ్య చరిత్రలో పంచాయితీలకు ఒక ప్రత్యేక స్థానం ఉందని, గ్రామ పంచాయితీ సక్రమ నిర్వహణ దేశానికే ప్రగతి అని, అభివృద్ధికి సూచిక అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నరసింహ, సచివాలయసిబ్బంది, నాయకులు రమణయ్య, మహీంద్రా, వెంకటేష్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.