మధుసూదన్ పార్థివ దేహాన్ని మోసి , నివాళులు అర్పించిన కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి

0

మధుసూదన్ పార్థివ దేహాన్ని మోసి , నివాళులు అర్పించిన కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి

BSBNEWS - కావలి 


జమ్మూకాశ్మీర్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కావలికి చెందిన మధుసూదన్ పార్థివ దేహాన్ని కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మోసి , నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి  మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి  సోమిశెట్టి మధుసూదన్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియ చేశారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ కుటుంబాన్ని  ఆర్థికంగా, ఉద్యోగ పరంగా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని వారు కోరారు. గతంలో ఉగ్రవాదుల దాడిలో అశువులు బాసిన వారికి తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ఏ విధంగా అయితే వారికి ఉద్యోగం, నాలుగు కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందించారో అదే విధంగా కూటమి ప్రభుత్వం కూడా సోమిశెట్టి మధుసూదన్ కుటుంబాన్ని ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ఉగ్ర వాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన 27 మంది కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ఇచ్చి ఉగ్ర వాదుల దాడి లో చనిపోయిన వారి ఆత్మలకు శాంతి చేకుర్చాలని కోరారు.

Post a Comment

0Comments
Post a Comment (0)