రెండో రోజుకు చేరుకున్న నిరసన దీక్ష
మద్దతు పలికిన మహిళా సమైక్య
BSBNEWS- కందుకూరు
పట్టణంలోని ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులను పెట్టడం సరికాదని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య అధ్యక్ష, కార్యదర్శులు మెండ శైలజ, వలేటి కల్పన లు తెలిపారు. స్థానిక ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో ఏఐటియుసి ఆధ్వర్యంలో వైద్యశాల పారిశుద్ధ కార్మికులు చేపట్టిన నిరసన ధర్నాకు ఏపీ మహిళా సమాఖ్య కలిసి మద్దతు ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాలుగు నెలల నుండి జీతాలు ఇవ్వకుండా, 3 సంవత్సరాల 7 నెలలు పి ఎఫ్ వేయకుండా అడిగితే పనిలోనుండి తీసేస్తామంటూ బెదిరిస్తున్నారని సరే అయింది కాదని వారు తెలిపారు. వైద్యశాలలో పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సేవ గొప్పదని అటువంటి వారిని ఇబ్బందులు పెట్టడం సరికాదన్నారు. కరోనా సమయంలో వైద్యశాలలో పని చేసే ప్రతి కార్మికుల్ని దేవుడిలా పూజించిన సంగతి అందరికీ తెలిసిందేనని, అటువంటి వారిని ఇబ్బందులకు గురి చేయటం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. కార్మికుల చేత పనిచేపించుకోవాల్సిన సూపర్వైజర్లు కాంటాక్ట్లకు మద్దతు పలకటం సరికాదని కార్మికులకు న్యాయం జరిగేవరకు వారికి మహిళా సమాఖ్య తోడుంటుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ ఉమ్మడి ప్రకాశం జిల్లా మాజీ అధ్యక్షులు, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బూసి సురేష్ బాబు, ఏఐటీయూసీ నియోజకవర్గ అధ్యక్ష, కార్యదర్శులు కే.మురళి, వై. ఆనందమోహన్, వైద్యశాల పారిశుద్ధ కార్మికులు యనమల వెంకటరత్నం, మరియమ్మ, ప్రమీల, చిన్నమ్మాయి, రాజు, జార్జ్, సాంసంగ్ తదితరులు పాల్గొన్నారు.