మానవత్వం చాటుకున్న కందుకూరు పోలీసులు

0

 మానవత్వం చాటుకున్న కందుకూరు పోలీసులు

BSBNEWS  KANDUKUR 

మానవత్వం చాటుకున్న కందుకూరు పోలీసులుప్రస్తుతం మండుతున్న ఎండల తీవ్రతకు అనేక మంది ఇబ్బందులకు గురవుతున్నారు. అలాంటి సందర్భంలో మందుబాబుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. కందుకూరు పట్టణంలో శ్రీ పొట్టి శ్రీరాములు బొమ్మ సెంటర్ నుండి సురేష్ రెడ్డి చికెన్ షాప్ కు వెళ్లే దారి మధ్యలో గుర్తు తెలియని వ్యక్తి మద్యం సేవించి ముళ్ళ చెట్లలో పడి ఉన్న దృశ్యం చూపరులకు బాధ కలిగించింది. దాంతో దగ్గరికి వెళ్లి చూస్తే ఆ వ్యక్తి కదిలాడకపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దాంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సృహతప్పి పడిపోయిన ఆ వ్యక్తిపై  నీళ్లు చల్లి అతనిని కాపాడారు. ఆ వ్యక్తికి ఎటువంటి గాయాలు తగలకుండా ముళ్ళ చెట్ల నుండి బయటకు తీసుకొచ్చారు. దగ్గరుండి ఆ వ్యక్తి వివరాలు అడిగి తెలుసుకొని సురక్షితంగా వెళ్ళగలడు అనుకున్న తర్వాతే అక్కడి నుంచి పోలీసులు వెళ్లడం జరిగింది. దాంతో చూపరులు ఊపిరి పీల్చుకొని పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆ వ్యక్తిని వివరాలు అడగగా బాపట్ల అని పని కోసం కందుకూరుకు వచ్చానని చెప్పడం జరిగింది.

Post a Comment

0Comments
Post a Comment (0)