ప్రసన్నాంజనేయ సన్నిధిలో ఇంటూరి
ప్రత్యేక పూజలు నిర్వహించిన ఇంటూరి నాగేశ్వరరావు దంపతులు
BSBNEWS - కందుకూరు
బాపట్ల జిల్లా అద్దంకి మండలం శింగరకొండ శ్రీప్రసన్నాంజనేయస్వామి దేవస్థానం వద్ద నూతన ధ్వజస్తంభం, ఆలయ కలిశ పునఃప్రతిష్ట, మహా కుంభాభిషేకం కార్యక్రమాలలో కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు దంపతులు పాల్గొన్నారు. ఆలయ కమిటీ, ఆలయ వేద పండితులు ఇంటూరి దంపతులకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రసన్నాంజనేయస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమానికి విచ్చేసిన పీఠాధిపతుల వద్ద ఇంటూరి కుటుంబం ప్రత్యేక ఆశీర్వచనాలు తీసుకున్నారు. శింగరకొండలో జరుగుతున్న దైవందిత కార్యక్రమాలలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.