సుస్మితకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తాం
ఏపీ మహిళా సమాఖ్య
BSBNEWS - కందుకూరు
కందుకూరు మండలంలోని శ్రీరంగరాజపురం గ్రామానికి చెందిన సుస్మిత అనే మహిళపై ఆమె భర్త, బావ, అత్త లు కలిసి ఆమెపై దాడి చేయడం జరిగిందని ఆమెకి న్యాయం జరిగేంత వరకు మేము పోరాటం సాగిస్తామని ఏపీ మహిళా సమాఖ్య అధ్యక్షరాలు మెండ శైలజ తెలిపారు. పట్టణంలోని ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్న సుష్మితను సోమవారం ఏపీ మహిళా సమాఖ్య నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భార్య భర్తల విషయంలో మరో వ్యక్తి కలగజేసుకొని దాడి చేయటం సరైనది కాదని, ఆ విషయమై సుస్మిత తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో పోలీసులు ఆశ్రయించగా వారికి న్యాయం జరగలేదని, దాడి చేసిన వ్యక్తిపై ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు దారి తీస్తున్నాయని వారు అన్నారు. ఆమెపై దాడి చేసినదే కాకుండా ఆమె తన భర్తను దాడి చేసిందని అబద్ధపు చేతలతో కేసులు పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని వారు ఆరోపించారు. ఒకపక్క రాష్ట్ర ప్రభుత్వం మహిళలపై ఏ చిన్నపాటి దాడులు జరిగిన వెంటనే చర్యలు తీసుకోవాలని చెబుతున్నారని కానీ వాస్తవానికి ఎక్కడ మహిళలకు న్యాయం జరిగిన సందర్భాలు కనిపించడం లేదని ఈ సందర్భంగా వారు తెలిపారు. సుస్మిత పై దాడి చేసిన వ్యక్తి పై కఠినంగా చర్యలు తీసుకునేంతవరకు సుస్మితకు మేము తోడుగా ఉంటామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ మహిళా సమాఖ్య కార్యదర్శి ఒలేటి కల్పన, కోశాధికారి కారంశెట్టి ఇంద్రజ తదితరులు ఉన్నారు.