ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని ఆదుకోవాలి
BSBNEWS - GUDLUR
గుడ్లూరు మండలం చెంచు రెడ్డిపాలెం గ్రామంలో అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న రైతు నరాల శ్రీనివాసులు రెడ్డి కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ఆదుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ కందుకూర్ ఇంచార్జ్ మహేశ్వరరావు సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బూచి సురేష్ బాబు సిపిఎం అనుబంధ రైతు సంఘం గుడ్లూరు మండల నాయకులు దామా కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం చెంచు రెడ్డిపాలెం గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న రైతు స్వగృహానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చనిపోయిన రైతుకు నష్టపరిహారం ప్రభుత్వం వెంటనే చెల్లించాలని పార్టీలకతీతంగా రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉందని వారు అన్నారు. ఒక జవాను మరణిస్తే ఏ విధంగా ఆ కుటుంబాన్ని ఆదుకుంటుందో అదే విధంగా రైతు చనిపోతే ఆ కుటుంబాన్ని సైతం ఆదుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని వారు తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోకపోతే వారికి న్యాయం జరిగేంతవరకు పోరాటం చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నియోజకవర్గ కార్యదర్శి యర్రంశెట్టి ఆనంద మోహన్, సి ఐ టి యు నాయకులు మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.