ప్లే టౌన్ బాక్స్ క్రికెట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు
BSBNEWS - కందుకూరు
పట్టణంలోని కోవూరు రోడ్డు సాయిబాబా గుడి ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన ప్లే టౌన్ బాక్స్ క్రికెట్ ను బుధవారం కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు, ఈ కార్యక్రమంలో డిఎస్పి సి.హెచ్.వి బాలసుబ్రమణ్యం లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కందుకూరు పట్టణంలో చిన్నారులను క్రికెట్ క్రీడాకారులుగా తయారు చేయుటకు, క్రికెట్ ఆడుకునేందుకు బయట ప్రాంతాలకు వెళ్లకుండా కందుకూరు పట్టణ ప్లే టౌన్ బాక్స్ క్రికెట్ ను ప్రారంభించటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. పట్టణంలో ఇలాంటి నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన నిర్వాహకులు డాక్టర్ డి.తిరుమలరావు, జొన్నాదుల శివరామకృష్ణ, చిన్ని రాజేష్, పబ్బిశెట్టి సురేష్ ని ఆయన అభినందించారు. ముందుగా ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుని డి.ఎస్.పి సి.హెచ్ వి బాలసుబ్రమణ్యంని ప్లే టౌన్ బాక్స్ క్రికెట్ నిర్వాహకులు ఘన స్వాగతం పలికి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, బిజెపి నాయకులు ఘట్టమనేని హరిబాబు, కొత్తూరి వెంకట సుధాకర్ రావు, డాక్టర్ చక్కా వెంకట కేశవరావు, పవన్ కుమార్, బలరామకృష్ణ, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.