వడదెబ్బ పట్ల చిన్నారులు అప్రమత్తంగా ఉండాలి
ప్రణవి చిన్నపిల్లల వైద్య నిపుణులు :- డాక్టర్ నవీన్
BSBNEWS - కందుకూరు
ఉష్ణోగ్రతలు పెరగడం వలన, ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది. ఎండాకాలం మొదలవగానే కొందరికి జలుబు అవుతుంది. కొందరికి బాడీ అంతా రాషెస్ వస్తుంటాయి మరికొందరికి డిహైడ్రాషన్ కలగడం వలన చిన్నారులకు వడదెబ్బ కలిగే అవకాశం ఉంటుంది. మరి ముఖ్యంగా చిన్నపిల్లలను వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అని ప్రణవి చిన్నపిల్లల వైద్య నిపుణులు. డాక్టర్ కే నవీన్ సూచించారు..
సందర్భంగా ఆయన మాట్లాడుతూ.పిల్లలలో వేడి అలసట మరియు వడదెబ్బ సంకేతాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్నారు.వడ దెబ్బను సరైన సమయంలో గుర్తించడం వలన పెద్ద ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు. మీ పిల్లలు అధిక కాలం ఎండలో గడిపిన తరువాత క్రింది లక్షణాలను ప్రదర్శిస్తే వెంటనే హైడ్రేషన్ థెరపీ చేసి అవసరమైతే మీ పిల్లల డాక్టర్ ను సంప్రదించండి, ఎందుకంటే వడ దెబ్బ తీవ్రత ప్రాణాపాయం కావచ్చు అని పేర్కొన్నారు.హీట్ స్ట్రోక్ లక్షణాలు కనిపించే ముందు, పిల్లలు తరచుగా వేడి తిమ్మిరి మరియు వేడి అలసట వంటి తేలికపాటి వేడి అనారోగ్యాల సంకేతాలు మరియు లక్షణాలను చూపుతారు. పిల్లవాడు వ్యాయామం చేయడం లేదా వేడిలో ఆడుకోవడం మరియు చెమట పట్టడం వల్ల అధిక ద్రవాలు మరియు ఉప్పును కోల్పోవడం వల్ల డీహైడ్రేట్ అయిన తర్వాత ఇది తరచుగా జరుగుతుంది. అని అన్నారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు:-
ఐదేళ్లలోపు పిల్లలు కనీసం 4-5 గ్లాసుల నీళ్లు తాగించాలి. కొబ్బరి నీళ్లు, మజ్జిగ, ఉప్పు కలిపిన నిమ్మరసం తీసుకోవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో కూల్డ్రింక్స్ విషపూరిత రసాయనాలు తీసుకోకూడదు జ్వరం, నీళ్ల వీరేచనాలు, అలసట, మూత్రం పోయకపోవడం, ఏమి తినక, తాగకపోవడం లక్షణాలు కన్పిస్తే ఆసుపత్రిలో చేర్పించాలి. ఇంట్లోకి వేడి రాకుండా తలుపులు, కిటీకీలు మూసి ఉంచాలి. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పిల్లలను బయటకు తీసుకెళ్లొద్దు. ఒకవేళ వెళ్లాల్సి వస్తే టోపీలు, గొడుగులు వాడాలి. మార్కెట్లో దొరికే కొన్ని ఓఆర్ఎస్లో షుగర్ శాతం ఎక్కువ. డీహైడ్రేషన్లో లో వీటిని ఇస్తే విరేచనాలు మరింత పెరుగుతాయి. డాక్టర్లు సూచించిన ఫార్ములా ఓఆర్ఎస్ మాత్రమే వినియోగించుకోవాలని ఆయన వివరించారు.