రమేష్ ఎయిర్ ట్రావెల్స్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు
BSBNEWS - KANDUKUR
కందుకూరు పట్టణంలోని కనిగిరి రోడ్ లో కేశినేని రమేష్ ఆహ్వానం మేరకు నూతనంగా ఏర్పాటు చేసిన రమేష్ ఎయిర్ ట్రావెల్స్ ను గురువారం ఉదయం కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు ప్రారంభించారు.ఈ సందర్భంగా మీరు ప్రారంభించిన వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతూ ప్రజల మన్ననలు పొందాలని మరియు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారు ఆకాంక్షించారు.ముందుగా ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యే గారికి కేశినేని రమేష్ కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికి శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు, మేడా మల్లికార్జున, నల్లబోతుల మురళి, అత్తోట మధుబాబు మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.