రోడ్డెక్కిన పొగాకు రైతులు

0

రోడ్డెక్కిన పొగాకు రైతులు

BSBNEWS - కందుకూరు 

గిట్టుబాటు ధర కల్పించాలంటూ పొగాకు రైతులు రోడ్డెక్కి నిరసన చేపట్టారు. పట్టణంలోని దూబగుంట వద్ద ఉన్న పొగాకు వేలం కేంద్రంలో రైతులు పొగాకు గిట్టుబాటు ధర లేదని వేలంపాటను నిలిపివేసి రోడ్డుమీద నిరసనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సంవత్సరం ప్రభుత్వం పొగాకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా మమ్మల్ని అన్యాయం చేస్తున్నారని మాకు న్యాయం జరిగేంత వరకు మేము ఈ నిరసనను కొనసాగిస్తామని వారు అన్నారు. పొగాకు కంపెనీలు అన్నీ కలిసి మాకు గిట్టుబాటు ధర కల్పించకుండా నాణ్యమైన పొగాకున సైతం తక్కువ రేటుకి కొనుగోలు చేస్తున్నారని ఇదేమిటని అడిగితే ధర ఇంతే ఇష్టమైతే ఇవ్వండి లేదంటే ఇంటికి తీసుకెళ్లండి అని కంపెనీలు చెబుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

Post a Comment

0Comments
Post a Comment (0)