మాకు మీరే న్యాయం చేయాలి
సబ్ కలెక్టర్ ఎదుట వాపోయిన ఎస్సీలు
BSBNEWS - కందుకూరు
నేటి సమాజంలో కూడా సామూహిక బహిష్కరణలు ఉన్నాయంటే ఆశ్చర్య పోవాల్సిన పరిస్థితి నెలకొంది. అటువంటి సంఘటన గుడ్లూరు మండలం దప్పలంపాడు లో చోటుచేసుకుంది. మాకు మంచి నీరు ఇవ్వటం లేదని మమ్మల్ని బహిష్కరిస్తున్నారని ఉపాధి పనికి సైతం మమ్మల్ని రానివ్వడం లేదని దప్పలంపాడు ఎస్సీ కాలనీ వాసులు సోమవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిరసన ధర్నా చేపట్టి మాకు న్యాయం చేయాలని సబ్ కలెక్టర్ కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ ఆదివారం దప్పలంపాడు గ్రామంలో నివసిస్తున్న కొంతమంది మా కులస్తులను ఇబ్బందులు పెట్టడంతో మేము పోలీసులను ఆశ్రమించామని దాంతో గ్రామస్తులు మా మీద పగ పట్టి కోపంతో మీకు మంచి నీళ్లు ఇచ్చేది లేదని, ఉపాధి పనులకు రావద్దని మిమ్మల్ని బహిష్కరిస్తున్నామని చెప్పి గ్రామంలో ని మైక్ లో ప్రచారం చేశారని, దాంతో ఇదేమిటని అడిగేందుకు వెళ్లిన మా పెద్దలను సైతం ఇబ్బందులు పెట్టడంతో మేము ఎవరు చెప్పుకోవాలో అర్థం కాక మాకు న్యాయం చేయాలని కందుకూరు సబ్ కలెక్టర్ తిరుమణి శ్రీ పూజ కు విన్నవించుకుందామని రావడం జరిగిందన్నారు. మా సమస్యను సబ్ కలెక్టర్కు వివరించామని స్పందించిన ఆమె సమస్యను పరిష్కరిస్తామని మాకు హామీ ఇవ్వడం జరిగింది అని వారు తెలిపారు. విషయం తెలుసుకున్న పలు సంఘాల నాయకులు మాట్లాడుతూ ఇంకా గ్రామాలలో సామూహిక బహిష్కరణలు జరుగుతున్నాయా అని వాటిని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తామని నేటి సమాజంలో అలాంటి బహిష్కరణ చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని సంబంధిత అధికారులను కోరారు.