ప్రతి ఆంధ్రుడు గర్వంగా తలెత్తుకునేలా అమరావతి నిర్మాణం
ఆంధ్ర రాష్ట్ర ప్రజల కళల రాజధాని త్వరలో సాకారం
BSBNEWS - కందుకూరు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కలల కన్న రాజధాని అమరావతి త్వరలో అన్ని హంగులతో సాకారం కానుండటం, ఎంతో శుభ పరిమాణం అని, రేపటి తరాల భవిష్యత్తు కోసం అద్భుతమైన, అద్వితీయమైన రాజధానిని అందించాలనే దృఢనిశ్చయంతో కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పనిచేస్తున్నారని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తెలిపారు. శుక్రవారం సాయంత్రం అమరావతిలో అమరావతి రాజధాని పునః ప్రారంభ కార్యక్రమంలో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొనడం ఆనందదాయకమన్నారు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల పేరుతో అమరావతిని సర్వనాశనం చేశారని, దేశంలోనే రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను చిత్రీకరించారని కానీ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మాకు అమరావతి అనే గొప్ప రాజధాని ఉందని ప్రతి ఆంధ్రుడు గర్వంగా తలెత్తుకునేలా నిర్మించబోతున్న విజనరీ లీడర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని తెలిపారు. ఈ సందర్భంగా అమరావతి సభ ప్రాంగణం వద్ద ఎమ్మెల్యే ఇంటూరి మీడియాతో మాట్లాడుతూ రాజధాని నిర్మాణానికి ఎన్డీఏ ప్రభుత్వంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్ని విధాల సహకరిస్తారన్నారు. రాజధాని లేని రాష్ట్రం నుండి ఒక అమోఘమైన రాజధాని కలిగిన రాష్ట్రంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో అమరావతి రూపుదిద్దుకుంటుందని ఆయన తెలియజేశారు.