కిషోరి వికాసం వేసవి శిక్షణ

0

 కిషోరి వికాసం వేసవి శిక్షణ

BSBNEWS - కందుకూరు 


కందుకూరు ప్రాజెక్ట్ అర్బన్ బి సెక్టార్ లోని సచివాలయాల పరిది లో గల అంగన్వాడీ సెంటర్ ల నందు కిషోరి వికాసం వేసవి శిక్షణ సూపర్ వైసర్ య ల్ లక్ష్మి దేవమ్మ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సిడిపిఓ కే.షర్మిష్ట ప్రకాశం ఆదేశాల మేరకు శుక్రవారం కిషోరి వికాసం ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది అని అన్నారు. మే రెండో వ తేదీ నుంచి, జూన్ పదో తేది వరకు, కిషోరి వికాసం వేసవి శిక్షణా కార్యక్రమా లు నిర్వహించడం జరుగుతుంది అని అన్నారు.బాల్య వివాహలు వల్ల కలిగే దుస్ప్రభావాలు, లింగ వివక్షత, అసమానత, బాలల రక్షణ చట్టం, పరిశుభ్రత, కౌమార బాల బాలికల నాయకత్వం, సాధికారత వంటి అంశాల పై అవగాహన కలిగించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమా నికి సచివాలయ  సిబ్బంది మహిళా పోలీస్ డి.పద్మ, ఆరోగ్య కార్యకర్తలు, ఆశ ఏ అనిత, అంగన్వాడీ కార్యకర్తలు విజయ, శ్రీ లక్ష్మి, యస్ కే రహం తున్నిష, యస్ కే నసీమ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)