మీ వెంట మేమున్నాం. చావో రేవో తేల్చుకుందాం
కరేడు గ్రామ రైతులను కలిసిన కెవివి ప్రసాద్
BSBNEWS - ఉలవపాడు
మండలంలోని కరేడు గ్రామంలో ఇండో సోలార్ కంపెనీకి భూములు ఇవ్వమని పోరాటం చేస్తున్న రైతులను సిపిఐ అనుబంధ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కెవివి ప్రసాద్ కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ మాకు ఇండోసోలార్ వద్దు మా భూములు మాకు కావాలని, రాష్ట్ర ప్రభుత్వం మాకు అన్యాయం చేస్తూ మాతో సంప్రదించకుండా మా భూములను లాక్కోవాలని చూస్తుందని తెలిపారు. సారవంతమైన భూములను మేము కోల్పోడానికి సిద్ధంగా లేవని తెలిపారు. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ లు మమ్మల్ని పక్కదారి పట్టిస్తూ మా భూములను లాక్కోవాలని చూస్తున్నారని వాపోయారు. అనంతరం కెవివి ప్రసాద్ మాట్లాడుతూ మీరు చేసే న్యాయ పోరాటానికి సిపిఐ, రైతు సంఘాలు మీ వెంట ఉండి చావో రేవో తేల్చుంటాం అని భరోసా ఇచ్చారు. మీ పొలలో ఒక్క సెంటు భూమి కూడా ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పారు. అభివృద్ధి జరగాలంటే ప్రజల అభిప్రాయాలు తెలుసుకొని ముందుకు పోవాలే తప్ప ప్రజా వ్యతిరేకంగా ఎటువంటి ప్రయత్నాలు చేయకూడదని ప్రభుత్వం పై మండిపడ్డారు. మీ ఉద్యమం న్యాయమైనదని ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని మీ పోరాటానికి మేము అన్ని పార్టీల రైతు సంఘాలను కలిసి మీ పోరాటంలో వారిని భాగస్వాములను చేసి మీ వెంట నడుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం ప్రకాశం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వి హనుమ రెడ్డి, కె వీరా రెడ్డి,సిపిఐ కందుకూరు నియోజకవర్గం కార్యదర్శి బూసి సురేష్ బాబు, కావలి కార్యదర్శి నాగరాజు , వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి దర్గా బాబు, ఏఐటీయూసీ నియోజకవర్గ కార్యదర్శి యర్రంశెట్టి ఆనంద మోహన్ తదితరులు పాల్గొన్నారు.