కందుకూరులో పొగాకు రైతులు అర్ధ నగ్న ప్రదర్శన ర్యాలీ
BSBNEWS - KANDUKUR
=లో గ్రేట్ పొగాకు కొనుగోలు చేసి గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు పట్టణంలోని 27వ పొగాకు వేలం కేంద్రంలో వేలంను నిలిపివేసి రోడ్డుపై నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం సిఐటియు ఆధ్వర్యంలో అర్ధ నగ్న ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ పొగాకు బోర్డు వేలం కేంద్రాల నుండి పోస్ట్ ఆఫీస్ సెంటర్ మీదుగా సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు చేపట్టారు అనంతరం సబ్ కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ లో గ్రేట్ పొగాకు కొనుగోలు చేయకపోతే మా పరిస్థితి ఏమిటని, ఈ సంవత్సరం బోర్డు ముగింపు దశకు వచ్చిందని ఇప్పుడు కూడా నాణ్యమైన పొగాకు కావాలంటే ఎలా వస్తుంది అని వారు ప్రశ్నించారు. లోగ్రేడు పొగాకు కొనుగోలు జరిగేంతవరకు వేలంపాటను నిలిపివేస్తామని వారు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పొగాకు రైతులకు న్యాయం చేస్తామని చెబుతున్నారే తప్ప ఆచరణలో మాత్రం మమ్మల్ని పట్టించుకున్న నాధుడే లేరని వారు వాపోయారు. పొగాకు రైతుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకువెళ్లి మాకు న్యాయం చేయాలని సబ్ కలెక్టర్ తిరుమణి శ్రీ పూజ ను కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎస్ ఏ గౌస్, జివిబి కుమార్, రైతులు తదితరులు పాల్గొన్నారు.

