అన్నం పెట్టే రైతులు పై కేసులు పెడతారా
పోలీసుల తీరుపై ఆగ్రహం
కే వి వి ప్రసాద్
BSBNEWS - ULVAPADU
అన్నం పెట్టే రైతులపై కేసులు పెట్టడం ఎంతవరకు న్యాయమని ఇది కూటమి ప్రభుత్వానికి పరాకాష్ట అని సిపిఐ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే వి వి ప్రసాద్ మండిపడ్డారు. సోమవారం కరేడులో గ్రామ రైతులను కలిసిన ఆయన వారి ఆవేదనను విన్న తర్వాత ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఎన్నికల్లో మాత్రం మేము రైతు పక్షపాతులమని నమ్మబలికి గెలిచిన అనంతరం కార్పోరేట్ శక్తులకు ఊడిగం చేస్తూ రైతులను ఇబ్బందులు పెట్టడం ఎంతవరకు న్యాయమని ఆయన ప్రశ్నించారు. కరేడు గ్రామ రైతులకు న్యాయం జరిగేంతవరకు వారి వెంట మేము నడుస్తామని ఆయన తెలిపారు. ఏ ప్రభుత్వం వచ్చినా పోలీసులను అడ్డుపెట్టుకొని పాలన సాగించటం సర్వసాధారణమైందని పోలీసులు కూడా అన్నం పెట్టే రైతులపై ప్రవర్తించిన వీరు సరికాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.