సంక్షోభంలోనూ ప్రజలకు సంక్షేమం..అది కూటమి ప్రభుత్వంకే సాధ్యం

0

 సంక్షోభంలోనూ ప్రజలకు సంక్షేమం..అది కూటమి ప్రభుత్వంకే సాధ్యం

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు

BSBNEWS - KANDUKUR 


సంక్షోభంలోను ప్రజలకు సంక్షేమం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు. పట్టణంలోని కేసరగుంట కాలనీలో లబ్ధిదారులకు సోమవారం పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి లబ్ధిదారులు ఇంటికి వెళ్లి ఆప్యాయంగా పలకరిస్తూ వారి కుటుంబ ఆర్థిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలు తెలుసుకున్న ఆయన సమస్యలు త్వరగా పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 5 ఏళ్లు జగన్ మోహన్ రెడ్డి పెన్షనర్లను దారుణంగా మోసం చేశాడు అని, రూ.1000/- పెంచేందుకు జగన్ రెడ్డికి నాలుగేళ్లు పట్టిందన్నారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒక్క సంతకంతో రూ.1000/- పెంచిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందని తెలిపారు. ప్రతి నెల 1వ తేదీనే వృద్ధులకు రూ.4 వేలు, దివ్యాంగులకు రూ.6 వేలు పూర్తి స్థాయి దివ్యాంగులకు రూ.15 వేలు పంపిణీ చేస్తూ దేశంలోనే అత్యధికంగా సామాజిక పెన్షన్లు అందిస్తున్న అతిపెద్ద సంక్షేమ రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ నిలిచిందని సగర్వంగా తెలియజేశారు. ఇది పేదల ప్రభుత్వం అని, పేదల జీవితాల్లో వెలుగులు నింపే మంచి మనసున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని  తెలిపారు. ముందుగా ఈ పెన్షన్ల కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుకి వార్డు నాయకులు ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కే.అనూష, పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, పట్టణ మాజీ టిడిపి అధ్యక్షులు పిడికిటి వెంకటేశ్వర్లు, ముచ్చు శ్రీనివాసరావు, ఉప్పుటూరి శ్రీనివాసరావు, చదలవాడ కొండయ్య, చిలకపాటి మధు, బెజవాడ ప్రసాద్, షేక్ రఫీ, వడ్డెళ్ళ రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)