ఈ నెల 10న కరేడుకు సిపిఐ రామకృష్ణ రాక
BSBNEWS - KANDUKUR
ఈ నెల 10 న ఉలవపాడు మండలంలోని కరేడుకు గ్రామానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ రానున్నట్లు రాష్ట్ర రైతు సంఘం ఉపాధ్యక్షులు వి. హనుమారెడ్డి తెలిపారు. కందుకూరు పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇండో సోలార్ కంపెనీ కి వ్యతిరేకంగా కరేడు రైతులు చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా సిపిఐ రామకృష్ణ కరేడులో రైతులతో ముఖాముఖి నిర్వహించి సమస్యలను తెలుసుకుంటారన్నారు. 8400 ఎకరాలలో మూడు పంటలు పండుతూ కరేడు చుట్టుపక్కల ప్రాంతవాసులందరికీ అన్నం పెడుతున్న రైతుల భూములను ఇండో సోలార్ కంపెనీకి అప్పగించే ప్రయత్నం విరవించుకోవాలని లేనిపక్షంలో రైతుల పక్షాన సిపిఐ తరఫున ఉద్యమ కార్యాచరణ రూపొందించుకోవడం జరుగుతుంది అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నెల్లూరు జిల్లా సహాయ కార్యదర్శి పి మాలకొండయ్య, అగ్రిగోల్డ్ కస్టమర్స్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.తిరుపతి రావు, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బూసి సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.