గుడిశ తిరుపతి రావు, పబ్బిశెట్టి వరదరాజా లకు ఘన సన్మానం
BSBNEWS - కందుకూరు
ప్రపంచ రక్త దాతల దినోత్సవం సందర్భంగా కావలి రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ వారు కావలిలోని శ్రీనివాస ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కందుకూరు కు చెందిన BLOOD బ్లడ్ డోనర్స్ వాట్సాప్ గ్రూప్, మహాత్మా గాంధీ విగ్రహ కమిటీ వారిని ఘనంగా సన్మానించారు. బ్లడ్ డోనర్స్ వాట్సాప్ గ్రూప్ సభ్యులు, కందుకూరు బీసీ కళాశాల విద్యార్థుల హాస్టల్ వార్డెన్ గుడిశ తిరుపతి రావు స్వతహాగా అంబేడ్కర్ భావజాలం కలిగి ఉండి నిబద్దత కలిగిన వార్డెన్ గా విధ్యార్థులకు స్పూర్తిదాయకంగా ఉంటూ ప్రతి సంవత్సరం హాస్టల్ లో చేరే విధ్యార్థులకు రక్తదానం పై అవగాహన కలిపిస్తూ వారితో రక్తదానం చేయిస్తూ కొత్త రక్తదాతలను తయారు చేస్తున్నారు. కందుకూరు పొట్టి శ్రీరాములు బజారు మహాత్మా గాంధీ విగ్రహ కమిటీ ప్రతినిధి పబ్బిశెట్టి వరదరాజా గాంధీ విగ్రహ ఆవిష్కరణ జరిగినప్పటి నుండి క్రమం తప్పకుండా ప్రతి ఏటా గాంధీ జయంతికి రక్త దాన శిబిరాలు ఏర్పాటు చేస్తూ ప్రతి సంవత్సరం కొత్త రక్తదాతలను తయారు చేయడానికి కృషి చేస్తున్నారు. వీరి ఇరువురి సేవలను గుర్తించిన కావలి రెడ్ క్రాస్ వారు ముఖ్యఅతిథులుగా పాల్గొన్న కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి చేతుల మీదుగా మెమోంటో, శాలువా లతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సేవ చేయటం గొప్ప వరమని అది అందరికీ కుదరదని ప్రజా సేవ చేసే ప్రతి ఒక్కరిని మనం గౌరవించుకోవడం మన బాధ్యత అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కావలి ఆర్డిఓ ఎం.వంశీ క్రిష్ణ, ఐ ఆర్ సి ఎస్ ఏపీ స్టేట్మెంట్ బ్రాంచ్ ట్రెజరర్ పి.రామచంద్రరాజు, ఐఆర్సిఎస్ నెల్లూరు జిల్లా బ్రాంచ్ చైర్మన్ వి.విజయకుమార్ రెడ్డి, రెడ్ క్రాస్ స్టేట్ చైర్మన్, రెడ్ క్రాస్ నెల్లూరు జిల్లా చైర్మన్, రెడ్ క్రాస్ స్టేట్ ఎగ్జిక్యూటివ్, కావలి రెడ్ క్రాస్ ఛైర్మన్ డాకారపు రవి ప్రకాష్ లు పాల్గొని సన్మాన గ్రహీతల సేవలను అభినందించారు. ఈ సందర్భంగా కందుకూరు రెడ్ క్రాస్ సబ్ బ్రాంచ్ చైర్మన్ చన్నా వెంకట రామాంజనేయులు మాట్లాడుతూ తిరుపతిరావు, వరదరాజా ల సామాజిక బాధ్యతతో కూడిన సేవలు ఆదర్శనీయం, స్పూర్తి దాయకం అని అభినందించారు.