ప్రజా ఫిర్యాదుల వేదికకు అధికారుల డుమ్మా..
BSBNEWS - KANDUKUR
రాష్ట్రవ్యాప్తంగా ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు ప్రతి సోమవారం ప్రజా ఫిర్యాదుల వేదిక కార్యక్రమంను అధికారులు నిర్వహిస్తారు. అయితే కందుకూరు పట్టణంలోని తహసిల్దార్ కార్యాలయం, సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల వేదికకు పలు శాఖల అధికారులు గైర్హాజరు అయ్యారు. ప్రజల సమస్యలు పరిష్కరించాల్సిన అధికారులే ప్రజా ఫిర్యాదుల వేదికకు రాకపోవడంతో సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయని పలు ప్రజా సంఘాలు పేర్కొంటున్నారు. అధికారులే కార్యక్రమానికి డుమ్మా కొట్టడంతో కార్యాలయాలకు సైతం వచ్చినా మా సమస్యలు పరిష్కారం కావని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే ఎంతో శ్రమపడి దూర ప్రాంతాల నుండి ప్రభుత్వ కార్యాలయలకు ప్రజలు దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతుందని పలువురు చర్చించుకుంటున్నారు.