ఎమ్మెల్యేను కలిసిన గయాజ్ భాయ్
BSBNEWS - KANDUKUR
కందుకూరు పట్టణంలోని పాత లారీ స్టాండ్ లో ఉన్న మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ లో గయాజ్ భాయ్ గరం చాయ్ ఓనర్ గయాజ్ భాయ్ కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావును మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే కార్యాదక్షతకు, ఆయనకున్న డెడికేషన్ కి, కందుకూరు పట్టణాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న పనులకు ఆకర్షితుడనై ఎమ్మెల్యేను కలవడం జరిగింది అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు శాలువ కప్పి ఓ చిరు బహుమానం ఇచ్చారు. ఎమ్మెల్యే ఎంత బిజీగా ఉన్నా ప్రేమగా మమ్మల్ని ఆప్యాయంగా పలకరించిన విధానం ఆనందంగా ఉందన్నారు. ఎమ్మెల్యే ను కలిసిన వారిలో సుల్తాన్ మొహిద్దిన్ నగర్ నాయకులు షేక్ రఫీ, షబ్బీర్ తదితరులు ఉన్నారు.