అసలు సూత్రధారి సీసీ విజయ భాస్కర్ రెడ్డి
ప్రజలకు అందుబాటులో లేకుండా నన్ను దాచి పెట్టింది ఏపిఎం, సిసి లే
జిల్లా కలెక్టర్, ఎస్పీ లను ఆశ్రయించిన విఓఏ
BSBNEWS -ONGOLE
పామూరు మండలంలో వెలుగు కార్యాలయంలో ఇటీవల పొదుపు గ్రూపుల సభ్యులకు తెలియకుండా లోన్లు తీసుకుని సభ్యులను మోసం చేసిందని విఓఏ బేబీ పై ప్రచారం జోరుగా సాగింది. అయితే ఆ ప్రచారాలు వాస్తవాలు కాదని అసలు నిజాలు నా దగ్గర సాక్షాదారాలతో సహా ఉన్నాయని నన్ను ఏపిఎం, సిసి లు నన్ను దోషిని చేసి వారు తప్పించుకునే ప్రయత్నిస్తూ నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నారని దానిపై విచారణ జరిపి నన్ను కాపాడాలని ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో జరుగుతున్న ప్రజా ఫిర్యాదుల వేదిక లో జిల్లా కలెక్టర్ ని, మంగళవారం జిల్లా ఎస్పీని పామూరు మండలం వివోఏ బేబీ ఆశ్రయించింది. పూర్తి వివరాల్లోకి వెళితే వివోఏ గా పామూరు మండలంలో పనిచేస్తున్న బేబీ గ్రూపు సభ్యుల డబ్బులను గోల్మాల్ చేసి పరారైందని ప్రచారం జోరుగా కొనసాగింది. అయితే బేబీ జరిగిన సంఘటనపై అసలు విషయాలను వివరిస్తూ సోమవారం జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వివో ఏ బేబీ మాట్లాడుతూ 2009 నుండి 2013 వరకు డిఆర్డిఏ వెలుగు కార్యాలయంలో విజయ భాస్కర్ రెడ్డి సీసీగా పనిచేసేవారని, ఆ సమయంలో డ్వాక్రా గ్రూపులను అతనే చూసుకునేవారని నాకు ఎటువంటి బాధ్యతలు అప్ప చెప్పేవారు కాదని కేవలం గ్రూపు సభ్యుల వరకు వెళ్లి నగదు వసూలు చేసే పని మాత్రమే చెప్పారని ఆమె తెలిపారు. అప్పుడు జరిగిన లావాదేవీలు తోపాటు ఇటీవల జరిగిన కొన్ని లావాదేవీలకు సంబంధించి సిసి విజయభాస్కర్ రెడ్డి నన్ను బెదిరిస్తూ పనులు చేయించుకునే వారని ఆమె ఆరోపించింది. విషయం గ్రూపు సభ్యులకు తెలిసేసరికి ఎప్పుడైనా సరే కార్యాలయానికి వచ్చి ప్రశ్నిస్తారని ముందుగా తెలుసుకున్న సీసీ విజయభాస్కర్ రెడ్డి ఏపిఎం విద్యాసాగర్ లు కలిసి కార్యాలయంలోని కొంతమంది సభ్యులతో లెక్కలు చూపిస్తామని చెప్పి నన్ను కనిగిరిలోని ఒక ప్రైవేటు లాడ్జిలో ఉంచి గ్రూపు సభ్యులకు విఓఏ డబ్బులుతో పరారైందని పేపర్ ప్రకటనలు ఇవ్వడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేసింది. విషయం తెలుసుకున్న నేను ఇదేమిటని వారిని అడగగా నిన్ను బయట పడేయాలంటే ఐదు లక్షల రూపాయలు ఇస్తే బయట పడేస్తామని చెప్పి సిసి విజయభాస్కర్ రెడ్డి, ఏపిఎం విద్యాసాగర్ లు కలిసి నన్ను బెదిరించారని, అవికాక నా వద్ద లక్ష రూపాయల వరకు డబ్బులు తీసుకున్నారని ఆమె ఆరోపించింది. వాటికి సంబంధించిన పూర్తి ఆధారాలు నా వద్ద ఉన్నాయని తెలిపింది. నేను ఐదు లక్షలు ఇవ్వలేనని చెప్పడంతో ఏపిఎం విద్యాసాగర్, సీసీ విజయభాస్కర్ రెడ్డి పలువురు సిబ్బంది కలిసి నాపై అబద్ధపు ఆరోపణలు చేసి వారు చేసిన అవినీతిని నామీద రుద్దాలని చూస్తున్నారని బోరున విలపించింది. సీసీ విజయభాస్కర్ రెడ్డి ఏపీఎం విద్యాసాగర్ లు నన్ను కనిగిరి లాడ్జిలో ఉంచినప్పుడు, తరువాత కొన్ని సందర్భాలలో నన్ను మానసికంగా, శారీరకంగా అనేక ఇబ్బందులను పెట్టారని మేము చెప్పింది చేయకపోతే నిన్ను జైలుకు పంపిస్తామని నన్ను బెదిరించారని ఆమె ఆరోపించింది. ఈ విషయాలపై విచారణ చేపట్టి వాస్తవాలను వెలికి తీసి గ్రూపు సభ్యుల నగదును గోల్ మాల్ చేసిన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. అందులో నా తప్పు ఉంటే అధికారులు తీసుకునే ఏ చర్యలు కైనా నేను సిద్ధంగా ఉన్నానని ఆమె తెలిపారు. నన్ను శారీరకంగా మానసికంగా ఇబ్బందులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకొని వారి నుండి నన్ను కాపాడాలని జిల్లా ఎస్పీ ముందు వివోఏ బేబీ ఆవేదన వ్యక్తం చేసింది. స్పందించిన జిల్లా అధికారులు ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసిన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకొని మీకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.