అన్న క్యాంటీన్ లో మూడుపూటలా అన్నదానం
- పిడికిటి వెంకటేశ్వర్లు
BSBNEWS - KANDUKUR
నిరుపేదల ఆకలి తీర్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా నా క్యాంటీన్లను నారా చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి మూడు పూటలా పేదల ఆకలి తీరుస్తున్నారని టిడిపి మాజీ పట్టణ అధ్యక్షులు పిడికిటి వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం పట్టణంలోని అన్న క్యాంటీన్ లో వలేటివారిపాలెం మండలం కాకుటూరు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పొడపాటి సుధాకర్ సతీమణి రమాదేవి ద్వితీయ వర్ధంతి సందర్భంగా ఆమె కుటుంబ సభ్యులు బుధవారం అన్న క్యాంటీన్లో ఉచితంగా ఆహారం అందజేశారు. సుధాకర్ తనయుడు పూర్ణ కార్తిక్, కుమార్తె జస్విక ఆధ్వర్యంలో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, స్వీట్స్ అందించారు. పలువురు టీడీపీ నాయకులు కార్యక్రమంలో పాల్గొని ఆహార పదార్థాలు వడ్డించారు. ఈ సందర్భంగా పిడికిటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభివృద్ధి బాటలో పయనిస్తూ సంక్షేమ ఫలాలను ప్రతి ఒక్కరికి అందిస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వాన్ని అన్నారు. అన్నా క్యాంటీన్ ద్వారా దాతలు పేదలకు ఆహారం అందించేందుకు ముందుకు వస్తున్నారని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ అన్నా క్యాంటీన్ ద్వారా అందించే ఆహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈకార్యక్రమంలో నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు కల్లూరి శైలజ, పట్టణ ప్రధాన కార్యదర్శి ముచ్చు శ్రీను, పట్టణ మహిళా కమిటీ అధ్యక్షురాలు ముచ్చు లక్ష్మిరాజ్యం, పార్టీ నాయకులు ఉన్నం వీరాస్వామి, మేడా మల్లికార్జున, అత్తంటి శ్రీలక్ష్మి, గుండవరపు లక్ష్మీ, తొట్టెంపూడి అశ్వినీ, దివి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.