జగన్ పర్యటనకు జన సమీకరణ చేస్తే చర్యలు తప్పవు
- సీఐ కె.వెంకటేశ్వరరావు
BSBNEWS -KANDUKUR
ఈనెల 31 నెల్లూరులో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా కందుకూరు సర్కిల్ ప్రాంతంలోని కందుకూరు మండలం, ఉలవపాడు మండలంలో జన సమీకరణకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కందుకూరు సిఐ కే వెంకటేశ్వరరావు హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ పర్యటనలో భాగంగా ఎవరైనా ర్యాలీలు, ప్రజలు గుంపులు గుంపులుగా వెళ్లడం, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, ప్రైవేటు ట్రావెల్స్ జనాలను తరలించటం, వివాదాస్పద ప్లెక్సీలు ఏర్పాటు చేయటం వంటి చర్యలకు పాల్పడితే సహించేది లేదని పోలీసులు పెట్టిన ఆంక్షలను ఉల్లంఘిస్తే ఎంతటి వారికైనా కఠిన చర్యలు తప్పవని అన్నారు.