జగనన్నకు ఘన స్వాగతం చెప్పండి

0

 జగనన్నకు ఘన స్వాగతం చెప్పండి 

బుర్రా మధుసూదన్ యాదవ్

BSBNEWS - KANDUKUR 


 శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు గురువారం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి వస్తున్న సందర్భంగా వైసిపి కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అధిక సంఖ్యలో ఘనస్వాగతం పలకాలని వైసిపి కందుకూరు నియోజకవర్గ ఇన్చార్జ్ బుర్ర మధుసూదన్ యాదవ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో మూలాఖత్ కు, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కుటుంబ పరామర్శకు వైసిపి అధినేతకు స్వాగత సుమాంజలి పలికేందుకు సన్నద్ధం చేస్తూ మండల పార్టీ,  పట్టణ పార్టీ అధ్యక్షులతో స్థానిక వైసిపి పార్టీ కార్యాలయంలో సమావేశమై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో వలేటివారిపాలెం మండల పార్టీ అధ్యక్షులు అనుములు లక్ష్మీనరసింహం, లింగసముద్రం అధ్యక్షులు నోటి వెంకటేశ్వర రెడ్డి, గుడ్లూరు అధ్యక్షులు కాపులూరి కృష్ణ, ఉలవపాడు మండల అధ్యక్షులు నన్నం పోతురాజు, కందుకూరు మండల అధ్యక్షులు ఈదర.రమేష్, కందుకూరు పట్టణ అధ్యక్షులు షేక్ రఫీ, జిల్లా నాయకులు తోకల కొండయ్య, చీమల వెంకటరాజా, ముప్పవరపు కిషోర్, బిల్లా రమణయ్య, రాష్ట్ర నాయకులు గణేశం గంగిరెడ్డి, చెరుకూరు బ్రహ్మయ్య, నియోజకవర్గ నాయకులు నల్లమోతు చంద్రమౌళి ,అమరనాథరెడ్డి, యరమల నాగభూషణం, ఉచ్చులూరి రవీంద్ర, పులి రమేష్ రేణమాల.అయ్యన్న, ఎడ్ల మాధవరెడ్డి, తల్లపునేని గోపి, షేక్ రహీం, షేక్ దస్తగిరి భాష, మట్లె వేణుగోపాల్, కాపులూరి మధుసూదన్, అప్పన బోయిన రాజేష్, బద్దిపూడి జయరావు, ఈర్ల.వెంకటేశ్వర్లు, కాట్రగడ్డ వెంకట్రావు, పసుపులేటి.వెంకటేష్, జంగిలి ఇశ్రాయేలు,జిల్లెలమూడి కోటేశ్వరరావు తదితరులు పాల్గోన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)