ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయంపై దాడి
BSBNEWS - కందుకూరు
పట్టణంలోని ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని ఆమ్ ఆద్మీ పార్టీ నేత నేతి మహేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. కందుకూరు సింగరాయకొండ రోడ్డులో గాయత్రీ కాలేజీ సమీపంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయంలో అర్ధరాత్రి దాటిన తరువాత గుర్తుతెలియని దుండగులు లోపలికి ప్రవేశించి ఫర్నిచర్ ను ధ్వంసం చేసినట్లు ఆయన తెలిపారు. కరేడు భూ సేకరణ అంశంపై టిడిపి, వైసిపిలపై తాను చేసిన విమర్శలకు హెచ్చరికగా ఈ దాడి జరిగిందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.