సచివాలయాలకు సిబ్బంది కరువా.?

0

సచివాలయాలకు సిబ్బంది కరువు....?

BSBNEWS - KANDUKUR 

రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యల సత్వరమే పరిష్కారం కోసం సచివాలయాల వ్యవస్థను తీసుకొచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఇటీవల సచివాలయ అధికారుల బదిలీలు జరిగిన తర్వాత సచివాలయాలకు సంబంధిత అధికారులు వారికి నచ్చినట్లుగా విధులు నిర్వహిస్తూ ప్రజలకు అందుబాటులో లేకుండా విధి నిర్వహణను పక్కదారి పట్టిస్తున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి అందుకు ఉదాహరణగా పట్టణంలోని ఎనిమిది, తొమ్మిది సచివాలయాలలోని  సచివాలయం సిబ్బంది సమయం కాకముందే ప్రజలకు అందుబాటులో లేకుండా వారి వ్యక్తిగత పనులకు వెళుతున్నట్లు సమాచారం.మధ్యాహ్నం మూడు తర్వాత సచివాలయాలకు వెళితే  కాళీ కుర్చీలు దర్శనమిస్తాయి. సంబంధిత అధికారులు పర్యవేక్షణ లోపం కారణంగానే ఇటువంటి సందర్భాలు ఎదురవుతున్నాయని ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రతిరోజు సచివాలయంలో మధ్యాహ్నం మూడు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ప్రజా ఫిర్యాదులు వేదికలో భాగంగా ప్రతి అర్జీని ప్రజల నుండి స్వీకరించి సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది అయితే సచివాలయాలు సిబ్బంది అందుబాటులో లేని కారణంగా సచివాలయాల వైపు ప్రజలు వెళ్లకుండా మున్సిపల్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్న సంఘటనలు అనేకం కనిపిస్తున్నాయి. సచివాలయాలలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోతే సచివాలయాలపై ప్రజలకున్న అభిప్రాయాలు మారుతాయనటంలో సందేహం లేదు.

Post a Comment

0Comments
Post a Comment (0)