తాటిపర్తి చంద్రశేఖర్ నోరు అదుపులో పెట్టుకో
- తెదేపా అధికార ప్రతినిధి గోచిపాతల మోషే
BSBNEWS - KANDUKUR
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పొలీట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్యపై ఎర్రగొండపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు తాటిపర్తి చంద్రశేఖర్ అనవసరంగా నోరు పారేసుకుంటే చూస్తూ ఊరుకోబోమని నెల్లూరు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి గోచిపాతల మోషే ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాటిపర్తి చంద్రశేఖర్ లాగా పదవి కోసం పది పార్టీలు మారే మనస్తత్వం వర్ల రామయ్యది కాదని, నీతికి, నిజాయితీకి మారుపేరుగా వర్ల రామయ్య నిలిచారని ఆయన అన్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో కొండపి నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నించి మా అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే టికెట్ నిరాకరిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచాన చేరిన నువ్వు 2019 - 2024 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మాదిగలకు తీవ్ర అన్యాయం జరిగితే ఏనాడు నోరు మెదపని నువ్వు వర్ల రామయ్య గురించి మాట్లాడతావా చంద్రశేఖర్ అంటూ ఆయన ద్వజమెత్తారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో మాదిగల పక్షాన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి వర్గీకరణకు సానుకూలమైన వాతావరణాన్ని వర్ల రామయ్య కల్పించారనే విషయాన్ని చంద్రశేఖర్ గుర్తుంచుకోవాలని ఆయన మండిపడ్డారు. జగన్ మోహన్ రెడ్డి తో ఎస్సీ వర్గీకరణ విషయం మీద వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిప్రాయాన్ని కూడా చెప్పించలేని కుహానా నాయకులారా మీరా వర్ల రామయ్యను విమర్శించేది అని చంద్రశేఖర్ పై మోషే ఘాటు వ్యాఖ్యలు చేశారు.