కరేడు యువకులకు ఉద్యోగాలు కల్పించడం నా బాధ్యత
- ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు
BSBNEWS - KANDUKUR
ఇండో సోలార్ పరిశ్రమలో కరేడు ప్రాంత వాసులకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది అని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు అన్నారు. గురువారం మీడియాతో ఆయన మాట్లాడుతూ ఇప్పటికే పరిశ్రమల యజమాని తో మాట్లాడటం జరిగిందని ఇండో సోలార్ పరిశ్రమలో కరేడు ప్రాంతవాసులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని అందుకోసం అవసరమైతే స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేసి చదువుకున్న యువతీ, యువకులకు ఉద్యోగ అవకాశాల తో పాటు ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలని వారిని కోరడం జరిగిందన్నారు. కరేడు ప్రాంత వాసులు ఎవరు అపోహలకు గురి కావద్దని అక్కడ నివసించే ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే లా చూడటం నా ప్రధానం లక్ష్యమని ఆయన అన్నారు.