ఇండియా టెస్ట్ క్రికెట్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ను కలిసిన వైఎస్ఆర్సిపి నేత రామాంజనేయరెడ్డి

0

 ఇండియా టెస్ట్ క్రికెట్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ను కలిసిన వైఎస్ఆర్సిపి నేత రామాంజనేయరెడ్డి 

BSBNEWS 

భారతదేశం తరఫున టెస్ట్ మ్యాచ్ క్రికెట్ కెప్టెన్ ఆల్ రౌండర్, భారత క్రికెటర్ 360. డిగ్రీస్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ ను మాజీ సర్పంచ్ వైఎస్ఆర్సిపి సీనియర్ నేత సన్నపురెడ్డి రామాంజనేయరెడ్డి బుధవారం ముంబై ఎయిర్పోర్ట్లో  కలిశారు. ఈ సందర్భంగా రామాంజనేయరెడ్డి ఉదయం ప్రతినిధితో మాట్లాడుతూ ముంబైలోని ఎయిర్పోర్టులో భారత స్టార్ క్రికెటర్ ప్రస్తుత ఇంగ్లాండ్ జట్టుతో ఆడుతున్న టెస్ట్ మ్యాచ్లకు కెప్టెన్ గా ఉంటున్న సూర్య కుమార్ యాదవ్ను కలవడం జరిగిందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తాను నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం వల్లేటి వారి పాలెం మండలం అంకుభూపాలపురం గ్రామం నుండి తాను ముంబై వచ్చానని తెలపగా సూర్య కుమార్ యాదవ్ స్పందించి ఇక్కడ తెలుగువారిని కలవడం చాలా ఆనందదాయకంగా ఉందని సూర్య కుమార్ యాదవ్  పేర్కొన్నట్లు రామాంజనేయరెడ్డి తెలిపారు . ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ముంబైకి ఎందుకు వచ్చావని తనను అడిగి తన యోగక్షేమాలను సూర్య కుమార్ యాదవ్ ప్రశ్నించారని రామాంజనేయులు తెలిపారు. ముంబైలో ముఖ్యమైన పనులు ఉండటం వల్ల తాను వచ్చినట్లు సూర్య కుమార్ యాదవ్ తో చెప్పానని ఆయన పేర్కొన్నారు భారతదేశ స్టార్ క్రికెటర్ సూర్య కుమార్ యాదవ్ ను కలిసి ఆలింగనం చేసుకోవడం నాకు చాలా ఆనందదాయకంగా ఉందని ఆయన ఈ సందర్భంగా ఉదయం ప్రతినిధితో ముచ్చటించారు ఇంగ్లండ్తో జరిగే నాలుగో నాలుగో టెస్ట్ మ్యాచ్ విజయవంతంగా భారతదేశం గెలిచి భారతదేశపు ఖ్యాతిని నిలబెడతారని  సూర్య కుమార్ యాదవ్ తో తాను చెప్పినట్లు పేర్కొన్నారు స్టార్ క్రికెటర్ సూర్య కుమార్ యాదవ్ ను కలవడం తన అదృష్టంగా భావిస్తున్నానని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)