కరేడు భూ సేకరణ వ్యవహారంపై అసత్య ప్రచారం తగదు
- భూపోరాట కమిటీ జేఏసీ నాయకులుసీ నాయకులు
BSBNEWS - KANDUKUR
కరేడు భూసేకరణ వ్యవహారంపై తప్పుడు ప్రచారాలు చేయటం తగదని కరేడు భూ పోరాట జేఏసీ కమిటీ హెచ్చరించింది. కరేడు భూ సేకరణ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చినట్టేనని ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రభుత్వం ఇచ్చిన వార్తపై బుధవారం స్థానిక తహసిల్దార్ కార్యాలయం వద్ద కరేడు భూ సేకరణ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భూ పోరాట కమిటీ జేఏసీ నాయకులు మిరియం శ్రీనువాసులు, బత్తుల వెంకట రమణారెడ్డి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కే అజయ్ కుమార్, సిపిఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు ఆర్ మోహన్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కే అజయ్ కుమార్ మాట్లాడుతూ. ఈ నెల నాలుగో తేదీ జరిగిన గ్రామ సభ లో సెంటు భూమి కూడా ఇవ్వము, ఇండ్లు ఖాళీ చేసేదే లేదని ఏకగ్రీవంగా నిర్ణయించింది తీర్మానం చేసిందన్నారు. ఈ సభలో దాదాపు ఐదు, ఆరు వేల మంది గ్రామ ప్రజలు పాల్గొన్నారన్నారు. ప్రజాభిప్రాయాన్ని పరికరంలోకి తీసుకొని వెనక్కి పోవలసిన ప్రభుత్వం దొంగ చాటుగా గ్రామసభ ఈనెల 26న మరొకసారి జరపాలని ప్రయత్నం చేయడంతో ప్రజల ఆందోళనతో వెనకడుగు వేశారన్నారు. తర్వాత గ్రామంలో ప్రజల మధ్య చీలిక తెచ్చి బయోత్పాతాలు కల్పించాలనేటటువంటి ఉద్దేశంతో ముగ్గురు గిరిజన మహిళలని తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించడం దారుణమని అన్నారు. బుధవారం తుతూమంత్రంగా నోటీసులు 10మందికి ఇచ్చి, మరో కొంతమందికి ఫోన్ లు చేసి ఉలవపాడు మండల తహసిల్దార్ కార్యాలయంలో ఈ తంతు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారో అర్థం కాని ప్రశ్నగా మారిందని ఆయన అన్నారు. కలెక్టర్ చదువుకున్న ఐఏఎస్ అధికారి, కందుకూరు ఎమ్మెల్యే అబద్ధాలు పత్రికలకు చెప్పటం అనేది వారి వృత్తికి కళంకం అని అన్నారు. 12, 13 వేల ఎకరాలు ఉండే కరేడులో కొద్దిమంది 50 లేదా 60 ఎకరాలు, అది వివాదాస్పద భూమి ఇస్తే, దాన్ని హైలెట్ గా చెప్పి నమ్మించి అసత్య ప్రచారం చేయటం అనేది ఎంతవరకు ప్రజాస్వామ్య దేశంలో సబబు అని ఆయన ప్రశ్నించారు. రైతుల కడుపు కొట్టే వ్యవహారాన్ని ముక్తకంఠంతో కరేడు ప్రజలు ఖండిస్తున్నారన్నారు. అన్ని రాజకీయ పార్టీలు ఐక్యంగా ఉద్యమిస్తున్నారని, కరేడు ఉద్యమం ఆంధ్ర రాష్ట్ర ఉద్యమంగా మారకముందే మీరు నోటిఫికేషన్ ను ఉపసంహరించుకొని, గౌరవంగా భూ సేకరణ నుండి వెనక్కి పోవలసిందిగా వామపక్షాల తరఫున కోరుతున్నామన్నారు. భూ పోరాట కమిటీ నాయకులు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆనంద్ కరేడు రైతులకు ఎకరాకు 20 లక్షలు ఇచ్చేందుకు ఇండోసోల్ కంపెనీ అంగీకరించిందని, ఆక్వా సాగు భూములకు 3 లక్షల నుంచి ఐదు లక్షల వరకు అదనంగా ఇస్తామని ప్రకటించిందన్నారు. దీంతో 100 ఎకరాలు వరకు రైతులు ఇచ్చేందుకు అంగీకార పత్రాలపై సంతకాలు చేశారని, రైతులు భూములు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని రైతులతో మైండ్ గేమ్ ఆడటం సిగ్గుచేటని పేర్కొన్నారు. వీరంతా అధికార ప్రభుత్వానికి చెందిన వ్యక్తులేనని, వీరిలో ఉద్యమంలో ఉన్న రైతులు ఎవరు లేరని పేర్కొన్నారు. 8400 ఎకరాలలో 100 ఎకరాలు ఏ పాటిదని ప్రశ్నించారు. రైతులను ఉద్యమంలో నుండి దూరం చేసే ప్రభుత్వ చర్యలు మానుకోవాలని కోరారు. గతంలో కందుకూరు శాసనసభ్యులు టెంకాయ చెట్ల పాలెం లో జరిగిన ఏడాది సుపరిపాలన సభలో మీ జోలికి రాము మీ భూములు తీసుకోము, మీరేమీ అధైర్య పడవద్దు అని చెప్పారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అదే మత్స్యకారులకు ఆఫీసుకు రమ్మని నోటీసులు ఇవ్వటం ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వం ఒకటి చెబుతూ మరొకటి చేస్తూ మత్స్యకారులను మభ్యపెడుతుందని విమర్శించారు. ఈకార్యక్రమంలో గ్రామ రైతులు మాలకొండారెడ్డి, అజిత్రెడ్డి, సిపిఎం ఉలవపాడు ప్రాంతీయ కమిటీ కార్యదర్శి జీవీబీ కుమార్, సిపిఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు కే నాంచార్లు తదితరులు పాల్గొన్నారు.