తల్లిపాలపై అవగాహన
BSBNEWS - KANDUKUR
పట్టణంలోని పడమటి మంగలి పాలెం అంగన్వాడి కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ లక్ష్మీదేవమ్మ పాల్గొని మాట్లాడుతూ ఆగస్టు ఒకటి నుండి ఏడవ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాల కార్యక్రమాలు అంగన్వాడి కేంద్రాలలో ఘనంగా నిర్వహిస్తున్నారన్నారు. ప్రతి ఒక్కరు తల్లులకు అవగాహన సదస్సు నిర్వహించి తల్లులకు సూచనలు చేయాలని అంగన్వాడీ కార్యకర్తలకు సూచనలు చేశారు. తల్లిపాలు బిడ్డకు వ్యాధి నిరోధక టీకాగా పనిచేస్తాయని పుట్టిన బిడ్డకి గంటలోపు ముర్రిపాలు పట్టించాలని తద్వారా వచ్చే ప్రయోజనాలను వివరించారు. శిశువుకు మాంసకృతులు, కొవ్వులు, పిండి పదార్థాలు అన్ని తల్లి మురిపాల ద్వారానే అందుతాయని, మొదటి ఆరు నెలలు తల్లిపాలు బిడ్డకు అమృత ఆహారంగా ఉపయోగపడతాయని అన్నారు. తల్లిపాలు సక్రమంగా పిల్లలకు అందించడం వలన పిల్లలలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి వ్యాధులు తక్కువగా వచ్చే అవకాశం ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారని తెలిపారు. తల్లులందరూ బిడ్డలకి తల్లిపాలు 6 నెలలు అందించాలని వివరించారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు దామా అనూష, బి.ఈశ్వరమ్మ దామా అపర్ణ, తల్లులు తదితరులు పాల్గొన్నారు.