కరేడు నిర్వాసితులకు అండగా మేముంటాం న్యాయపోరాటం చేస్తాం

0

కరేడు నిర్వాసితులకు అండగా మేముంటాం న్యాయపోరాటం చేస్తాం

- ఐలు అఖిలభారత అధ్యక్షులు సుంకర రాజేంద్రప్రసాద్

BSBNEWS - ULAVAPADU



రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా, భూమి మాదే ఊరు మాదే అని కరేడు రైతులు, వ్యవసాయ కూలీలు, మత్స్యకారులు, గిరిజనులు మహిళలు చేస్తున్న ప్రజా పోరాటానికి, అండగా మీతో కలిసి న్యాయపోరాటం చేయటానికి సిద్ధంగా ఉన్నామని అందుకోసమే మీ గ్రామాలు పర్యటన చేస్తున్నామని ఆల్ ఇండియా లాయర్ యూనియన్ (ఐ లు) అఖిల భారత అధ్యక్షులు సుంకర రాజేంద్రప్రసాద్ అన్నారు. గత కొంతకాలంగా ఇండోసోల్ కు వ్యతిరేకంగా మీరు చేస్తున్న ప్రజా పోరాటం మొత్తం సమాజం చూస్తుందని అన్నారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో విశాలంగా  బీడు భూములు ఉంటే అలాంటి వాటిని వదిలి, ఇంతటి పచ్చని పంటపొలాలను ఇండోసోల్ కోసం తీసుకోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. గతంలో జగన్ ప్రభుత్వం ఇండోసోల్ కి భూసేకరణ చేస్తుంటే, ఇండోసోల్ జగన్ బినామీ సంస్థ అని అన్న కూటమి పార్టీలు, ఇప్పుడు ఇండోసోల్ సంస్థ ను భుజాన వేసుకొని ఎందుకు మోస్తున్నారని ప్రశ్నించారు. దీని వెనక ఆంతర్యం కరేడు పచ్చని పొలాలలో అపారమైన ఖనిజ సంపద ఉందని, అందుకోసమే కరేడు ను ఇండోసోల్ ప్రాజెక్టుకు ప్రభుత్వం ఎంపిక చేసిందిన్నారు. భూ సేకరణ,  నిర్వాసిత ప్రాంతాలలో 21 మంది హైకోర్టు అడ్వకేట్లు, పౌర హక్కుల సంఘం, ఏపీ సి ఎల్ సి నాయకులు సుంకర రాజేంద్ర ప్రసాద్ తో కలిసి పర్యటించారు. ముందుగా కరేడు రామకృష్ణాపురం గిరిజన మహిళలు పొన్నం రామలక్ష్మమ్మ, జగన్నాథం శేషమ్మ, కత్తి సుజాత మా కాలనీ పోరాటాలతో ఏర్పడిందని, పోరాడి నిలబెట్టుకుంటాం కానీ, ఇక్కడినుండి వెళ్లేది లేదని చెప్పడంతో వారిని ఉద్దేశించి ఐలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లూరి మాధవరావు మాట్లాడారు. మీరు గత నెల 29వ తేదీన చేసిన జాతీయ రహదారి దిగ్బంధనం, ఈనెల 4న గ్రామసభలో మీరు ప్రదర్శించిన పోరాట పట్టిమ దీనినే కొనసాగించాలని న్యాయవాదులుగా , న్యాయ పోరాటానికి మేకుతో కలిసి నడుస్తామని, అందుకే మీ దగ్గరకు వచ్చామని అనంతరం అలగాయపాలెం, బట్టి సోమయ్యపాలెం, టెంకాయ చెట్ల పాలెం, చిన్న పల్లెపాలెం, పెద్దపల్లి పాలెం తదితర చోట్ల మత్స్యకారులతో, నర్సరీ లలో పనిచేస్తున్న మహిళలతో కలిసి మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. నర్సరీ మహిళలు మాట్లాడుతూ కరేడు నర్సరీ లోనే ప్రకాశం జిల్లా కంతా సరుగుడు, జామాయిల్ నారు సరఫరా చేస్తామని, ఇక్కడ పండించిన కూరగాయలనే రెండు జిల్లాలకు ఎగమతి చేస్తావని తెలిపారు. మత్స్యకారులు మాట్లాడుతూ మమ్మల్ని ఎక్కడికి తరలించినా, మేము చావనైనా చస్తాము గాని మరో ప్రాంతానికి వెళ్ళమని తేల్చి చెప్పారు. సముద్రానికి మాకు ఎంతో అనుబంధం ఉందని మమ్మల్ని గ్రామం నుండి పంపినా, సముద్రాన్ని పంపలేరు కదా అని తెలిపారు. సముద్రాన్ని, మత్స్య సంపదను వదిలి మేము ఉండలేము అని అన్నారు. ఊరు ఖాళీ చేయము. భూములు ఇచ్చేది లేదని చెప్పారు. మీరు పోరాడండి మీకు అవసరమైన న్యాయ సలహాలు, కింది కోర్టులో హై కోర్టులో మేము సహకరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కటారి అజయ్ కుమార్, కందుకూరు నియోజకవర్గ నాయకులు జి వెంకటేశ్వర్లు, ఉలవపాడు ప్రాంతీయ కమిటీ కార్యదర్శి జీవి బి కుమార్, నాయకులు పొట్లూరి.రవి, గ్రామ నాయకులు అజిత్ రెడ్డి, మాలకొండ రెడ్డి, జయరామిరెడ్డి, రమణారెడ్డి, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు నేతి మహేశ్వర రావు, సిపిఐ కందుకూరు నియోజకవర్గ కార్యదర్శి  బూసి సురేష్ బాబు, సామాజికవేత్త వసుంధర, హైకోర్టు అడ్వకేట్ శ్రీదేవి, సామాజిక కార్యకర్త పాలేటి. కోటేశ్వరరావు, హైకోర్టు అడ్వకేట్లు నర్రా శ్రీనివాస్, నూతలపాటి కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. 

Post a Comment

0Comments
Post a Comment (0)