తహసిల్దార్ కార్యాలయావరణంలో పెట్రోల్ బంక్ సమంజసం కాదు
- సిఐటియు రాష్ట్ర నాయకులు నర్సింహారావు
BSBNEWS - కందుకూరు
ప్రజలు తమ సమస్యల పరిష్కారాన్ని కోసమై వచ్చే ప్రభుత్వ కార్యాలయాల మధ్య పెట్రోల్ బంక్ సమంజసం కాదని సిఐటియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ సిహెచ్ నరసింహారావు అన్నారు. శనివారం స్థానిక తహసిల్దార్ కార్యాలయం ఆవరణంలో పెట్రోల్ బంక్ నిర్వహణకు చేపట్టిన పనులను కందుకూరు అభివృద్ధి కమిటీతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సిహెచ్ నరసింహారావు మాట్లాడుతూ 9 ప్రభుత్వ కార్యాలయాలన్న చోట పెట్రోల్ బంకు నిర్వహణకు అనుమతులు ఇవ్వటం దారుణమని అన్నారు. ప్రభుత్వ భూములను ప్రైవేటు సంస్థలకు దారాదాత్తం చేయటం న్యాయం కాదని వాటిని ప్రజలు చూస్తూ ఊరుకోరని ప్రజలలో తిరుగుబాటు వస్తుందని ఆయన అన్నారు. పర్యావరణాన్ని రక్షిస్తామని చెబుతున్న ప్రభుత్వాలు ఎన్నో సంవత్సరాలుగా ఉంటున్న చెట్లను నరికేందుకు ప్రయత్నాలు జరుగుతా ఉంటే ఎందుకు ఆపడం లేదని ఇది సరైనది కాదని వారు అన్నారు. వ్యాపార సంస్థలకు ప్రభుత్వ భూములను ఇవ్వడం న్యాయమైనది కాదని ఇల్లు లేని పేదవాడు ఇల్లు కట్టుకోవటానికి స్థలం కేటాయించాలని అడిగితే ఇచ్చేది లేదంటూ కరాకండిగా చెప్పే అధికారులు పెట్రోల్ బంకు అంటి వ్యాపార సంస్థలకు ఎలా ఇస్తుందో ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా పునరాలోచించి వేల సంఖ్యలో తమ సమస్యల పరిష్కారానికి వచ్చే ప్రభుత్వ కార్యాలయ ఆవరణంలో పెట్రోల్ బంక్ స్థాపనను విరమించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కందుకూరు అభివృద్ధి కమిటీ నాయకులు పాలేటి కోటేశ్వరరావు, తోకల వెంకటేశ్వర్లు, ముప్పవరపు కిషోర్ లు పాల్గొన్నారు.