వసతులకు నోచుకోని సచివాలయం

0

వసతులకు నోచుకోని సచివాలయం 

BSBNEWS - KANDUKUR 

రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు సచివాలయాలను ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే ఆ సచివాలయాలలో పనిచేసే సిబ్బందికి అవసరమైన కనీస వసతులను ఏర్పాటు చేయడంలో అధికారులు విఫలమవుతున్నారు. సచివాలయాలలో పనిచేసే మహిళ ఉద్యోగులు వారి సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని అయోమయంలో ఉండిపోతున్నారు. కందుకూరు మున్సిపాలిటీ పరిధిలోని ఏడవ సచివాలయంలో సచివాలయం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు వారికి మరుగుదొడ్లు లేవు. అప్పటినుండి పలుసార్లు ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకువెళ్లిన చూస్తాం చేస్తాంలే అన్న సమాధానాలు తప్ప మరి ఏమి ప్రయోజనం లేకుండా పోయింది అని అక్కడ పని చేసే సిబ్బంది తెలుపుతున్నారు. నీటి వసతి కూడా సక్రమంగా లేకపోవడంతో ఆ సచివాలయంలో పనిచేసే సిబ్బంది ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఎవరు వచ్చినా మేము పనిచేయడం లేదు ప్రజలకు అందుబాటులో లేరు అని మాపై విమర్శలు కురిపిస్తారే తప్ప మా సమస్యలు పట్టించుకునే వారు ఎవరు కానరాటం లేదని వాపోతున్నారు. రాష్ట్రంలో మహిళకు ఉన్నత పీఠం వేస్తామని చెప్పే ప్రభుత్వాలు ఆ మహిళలు పనిచేసే చోట అవసరమైన వసతులు కల్పించడంలో ఎందుకు అలసత్యం వహిస్తున్నారు అని మహిళా సంఘాలు అధికారులను ప్రశ్నిస్తున్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)