స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

0

 స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్


BSBNEWS - ఒంగోలు 




ఒంగోలు లోని జీజీహెచ్ లో ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఒంగోలు శాసన సభ్యులు దామచర్ల జనార్దన్ రావు, నగర మేయర్ గంగాడ సుజాత లతో కలసి జిల్లా కలెక్టర్ పి రాజాబాబు స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యకరమైన మహిళలు, బలమైన కుటుంబాల కోసం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా అన్ని ఆరోగ్య ఉపకేంద్రముల యందు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రముల యందు, సామాజిక ఆరోగ్య కేంద్రముల యందు, ఏరియా ఆసుపత్రుల యందు, జిల్లా ఆసుపత్రుల యందు 17 సెప్టెంబరు నుండి 2 అక్టోబరు 2025 వరకు  స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్ జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా వెంకటేశ్వర్లు, స్టేట్ నోడల్ అధికారి శ్యామలాదేవి, జీజీహెచ్ ఇంచార్జి సూపరింటెండెంట్ డా కిరణ్ కుమార్, ప్రిన్సిపాల్ అశోక్ కుమార్, డి సి హెచ్ ఎస్ డా.శ్రీనివాస నాయక్, ఐ సి డి ఎస్ పిడి సువర్ణ,  జీజీహెచ్ వైద్యులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)