సహకార సంఘం అభివృద్ధికి ఎల్లప్పుడూ తన వంతు సహాయ సహకారాలు ఉంటాయి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరావు

0

సహకార సంఘం అభివృద్ధికి ఎల్లప్పుడూ తన వంతు సహాయ సహకారాలు ఉంటాయి

 ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరావు

BSBNEWS - వలేటివారిపాలెం


వ్యవసాయ సహకార సంఘాల పునరుద్ధరణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, వీటి బలోపేతానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు అన్నారు. వలేటివారిపాలెం మండలంలో బుధవారం వ్యవసాయ సహకార సంఘం నూతనంగా ఎన్నికైన డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు, టొబాకో బోర్డు వైస్ చైర్మన్ గుత్తా వాసుబాబు, జిల్లా డైరీ మాజీ చైర్మన్ చల్లా శ్రీనివాసరావు లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు తక్కువ వడ్డీ రుణాలు, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఆయన చెప్పారు. పంట నిల్వ, మార్కెటింగ్ సదుపాయాలను మెరుగుపరచడం ద్వారా రైతుల ఆర్థిక స్థితిని మెరుగుపరచడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆయన వివరించారు. గత ప్రభుత్వంలో వ్యవసాయ సహకార సంఘాలను పూర్తిగా నిర్వీర్యం చేశారని, రైతులకు వ్యవసాయానికి సరిగ్గా రుణాలు కూడా ఇవ్వలేకపోయారని విమర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే సహకార సంఘాల బలోపేతానికి కృషి చేస్తున్నారని, కూటమి ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడి రైతులకు మేలు చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతుందని తెలిపారు. వలేటివారిపాలెం పంచాయతీలో గత ఎన్నికల్లో తనను మంచి మెజారిటీతో దీవించారని గుర్తు చేసుకుంటూ, ప్రజలకు  ఏ సమస్య ఉన్న తన వద్దకు రావచ్చునని, గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన గుత్తా మహేశ్వరరావు, డైరెక్టర్లు చింతలపూడి నర్సింగరావు, నేతి నరసింహులకు ఆయన అభినందనలు తెలిపారు. వలేటివారిపాలెం మండలం ప్రైమరీ హెల్త్ సెంటర్లో  మంచినీటి కొరకు మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిన టొబాకో బోర్డు వైస్ చైర్మన్ గుత్తా వాసుబాబుని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ప్రత్యేకంగా అభినందించారు. తన తండ్రి, మాజీ జడ్పీ చైర్మన్ గుత్తా వెంకటసుబ్బయ్య పేరుతో ఇటువంటి సేవా కార్యక్రమం చేపట్టడం ఆదర్శప్రాయం అని అన్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు, సభ్యులు తమపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలుపుతూ రైతుల ప్రయోజనాలను కాపాడుతూ సంఘాన్ని మరింత బలోపేతం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో నరేంద్ర దేవ్, మండల పార్టీ అధ్యక్షులు మాదాల లక్ష్మీ నరసింహాం, గ్రామ పార్టీ అధ్యక్షుడు కాకుమాని ఆంజనేయులు, పార్టీ నాయకులు వలేటి నరసింహం, వలేటి శ్రీధర్ నాయుడు, ఎంపీటీసీ వలేటి నరసింహం, కాకుమాని మాల్యాద్రి, గుత్తా కొండయ్య, పరిటాల భాస్కర్, కొంకా రమేష్, కాకుమాని హర్ష, గుత్తా తిరుపతయ్య, మన్నం మాధవరావు, వీరమాసు అంజయ్య, మీసాల మాల్యాద్రి, దాసరి తిరుపతి స్వామి, ఎస్కే ఖాజావలి,  పరిటాల శివ, గుత్తా అచ్యుత్, పోతురాజు సురేష్, వలేటి వెంకటరావు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. 

Post a Comment

0Comments
Post a Comment (0)