ఉన్నతవిద్యతో పాటు సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించడమే నారాయణ లక్ష్యం

0

 ఉన్నతవిద్యతో పాటు సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించడమే నారాయణ లక్ష్యం

BSBNEWS-KANDUKUR




నారాయణ విద్యా సంస్థలో చదివే ప్రతి ఒక్కరికి ఉన్నత విద్యతో పాటు సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించడమే నారాయణ లక్ష్యం అని క్లస్టర్ ప్రిన్సిపల్ విజయలక్ష్మీ అన్నారు. మంగళవారం పట్టణంలోని నారాయణ స్కూల్ లో ప్రిన్సిపల్ అనీస్ భాను ఆధ్వర్యంలో విద్యార్థులకు మెడికల్ క్యాంప్ జరిగింది. ఈ క్యాంప్ లో ముఖ్య అతిథిలుగా ఎల్.వి ప్రసాద్ వైద్యశాల కంటి నిపుణులు డాక్టర్ సల్మాన్ ఖాన్, కృష్ణ సాయి హాస్పిటల్ నుండి దంత నిపుణులు డాక్టర్ మనోజ్, సురక్ష వైద్యశాల నుండి గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రదీప్తి లు పాల్గొని విద్యార్థి, విద్యార్థినిలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా విజయలక్ష్మీ మాట్లాడుతూ విద్యార్థులు ఆరోగ్యం ఉంటేనే చదువుపై దృష్టి సారించగలరని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో చిన్నపిల్లలకు సైతం కంటి సమస్యలు వస్తున్నాయని వాటిని ముందుగా గుర్తించి సరైన చికిత్స తీసుకోవడం వలన భవిష్యత్తులో కంటి సమస్యలు అధిగమిస్తారని ఆమె అన్నారు. ప్రస్తుతం మనం తినే ఆహారంలో మార్పులు ఉండటం వలన బాలికలకు సైతం ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని తమ తల్లిదండ్రులకు సైతం చెప్పుకోలేని కొన్ని సమస్యలు వారు ఎదుర్కొంటున్న పరిస్థితిలో ఉన్నారని వాటిని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు బాలికలలో తలెత్తకుండా ముందు జాగ్రత్తగా బాలికల తల్లిదండ్రులు గమనించాలని ఆమె తెలిపారు. నారాయణ విద్యాసంస్థల ఆధ్వర్యంలో బాలికలకు సైతం గైనకాలజిస్ట్ ద్వారా పరీక్షలు నిర్వహించి ఎవరైనా అటువంటి సమస్యలు ఎదుర్కొంటుంటే వారి తల్లిదండ్రులను సంప్రదించి సమస్యలు పరిష్కరించేందుకు ప్రయత్నం చేయడం జరుగుతుందని ఆమె తెలిపారు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న పెద్దల మాటలను నిజం చేయాలంటే మన ఆహార అలవాట్లను కొంత మీద మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె అన్నారు. ప్రిన్సిపల్ అనీస్ భాను మాట్లాడుతూ నారాయణ విద్యాసంస్థల్లో చదువుకునే ప్రతి ఒక్కరికి మంచి విద్యను అందిస్తూ, ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా వారి బంగారు భవిష్యత్తు కి నారాయణ విద్యాసంస్థలు బాటలు వేస్తుందని ఆమె అన్నారు. క్రమశిక్షణతో పాటు, విద్య ఆరోగ్యం అందించటమే నారాయణ ప్రధాన లక్ష్యం అని ఆమె అన్నారు. అక్షరాసుల తల్లిదండ్రులను సైతం తీర్చిదిద్దే విధంగా విద్యార్థులను నారాయణ విద్యాసంస్థలు తయారు చేస్తుందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఆర్ మస్తానయ్య, ప్రశాంత్, అకాడమిక్ డీన్ జానీ, వైస్ ప్రిన్సిపాల్స్ శ్రీలక్ష్మి, తేజస్విని, ఏఎన్ఎం శైలజ, పాఠశాల సిబ్బంది విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)