పట్టుదలతో చదివితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు డిఇఓ బాలాజీ రావు

0

పట్టుదలతో చదివితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు

డిఇఓ బాలాజీ రావు

BSBNEWS - కందుకూరు


విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో చదివి పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని నెల్లూరు జిల్లా విద్యాశాఖాధికారి ఆర్. బాలాజీ రావు పిలుపునిచ్చారు. సోమవారం పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పదవ తరగతి విద్యార్థుల స్టడీ అవర్స్ తీరును, వారి విద్యా సామర్థ్యాలను ఆయన స్వయంగా పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పదవ తరగతిలో సెకండ్ క్లాస్ లేదా థర్డ్ క్లాస్ మార్కులు వచ్చినంత మాత్రాన విద్యార్థులు నిరాశ చెందకూడదని ఆయన హితవు పలికారు. తక్కువ మార్కులు వచ్చిన వారు కూడా పట్టుదలతో శ్రమిస్తే భవిష్యత్తులో ఐఏఎస్, ఐపిఎస్ వంటి ఉన్నత స్థాయి అధికారులయ్యే అవకాశం ఉంటుందని ఉదాహరణలతో వివరించారు. ప్రభుత్వం విడుదల చేసిన సీక్రెట్ మోడల్ పేపర్లను విద్యార్థుల చేత క్షుణ్ణంగా ప్రాక్టీస్ చేయించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. పరీక్షలకు సమయం దగ్గర పడుతున్నందున సమయాన్ని వృథా చేయకుండా, ప్రణాళికాబద్ధంగా చదివి తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులను కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, తెలుగు టీచర్లు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. 

Post a Comment

0Comments
Post a Comment (0)