సమస్యలు పరిష్కరించాలని మనవహరం చేసిన అంగన్వాడీలు

0

అంగన్వాడి న్యాయమైన కోర్కెలను పరిష్కరించాలని చేపట్టిన నిరవధిక సమ్మె 11వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా ఎంపీడీవో కార్యాలయం నుండి అంగన్వాడీలు ప్రదర్శనగా బయలుదేరి ఉదయగిరి రోడ్డు కూడలిలో మానవహారం చేపట్టడం జరిగింది.ఈ మానవహారంతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి.

ఈ సందర్భంగా అంగన్వాడి వర్కర్స్ యూనియన్ నాయకులు ఈ రమాదేవి, వజ్రమ్మ ,కామేశ్వరి సీఐటీయూ నాయకులు కర్ర పోలయ్య ,మాట్లాడుతూ తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని 11 రోజుల నుండి నిరవధికంగా పోరాటం చేస్తుంటే ముఖ్యమంత్రి స్పందించలేదని అక్కచెల్లెమ్మల పాలన అని చెప్పి ఇప్పుడు అక్కాచెల్లెమ్మలకు న్యాయం చేయకుండా భీష్ముంచుకొని ఉన్నాడని ఆయన పుట్టిన రోజు నాడు కేకులు కట్ చేసుకుని సంబరాలు జరుపుకుంటే మేము కొంగు పట్టుకొని భిక్షాటన చేసి వీధులెక్కి పోరాటాలు చేస్తున్నామని ఇప్పటికీ ముఖ్యమంత్రికి మా మీద దయ కలగలేదని చాలీచాలని జీతాలతో మా కుటుంబాలు అస్తవ్యస్తంగా ఉన్నాయని పెరిగిన ధరలతో కొని తినలేక ఉన్నామని అయినా ముఖ్యమంత్రి కి మా మీద దయ కలగలేదని అన్నారు.

ఇప్పటికైనా మా న్యాయమైన కోర్కెలను కనీస వేతనం 26,000 ,,రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షలు, పనిభారం ,ఇతర డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని మా సమస్యలు పరిష్కరించేంతవరకు ఈ సమ్మె కొనసాగిస్తామని తెలిపారు. 

ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు పసుపులేటి పెంచలయ్య ,వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు టి మాల్యాద్రి, ఉలవపాడు మండల సిఐటియు నాయకురాలు సిహెచ్ ఇందిరమ్మ, వై కృష్ణమోహన్,జి మధుసూదన్ రావు, అంగన్వాడి నాయకులు కే సుభాషిని, కళావతి, సౌజన్య, సుకన్య,పెంచలమ్మ, హిమబిందు, అంగన్వాడి టీచర్లు మరియు హెల్పర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags

Post a Comment

0Comments
Post a Comment (0)