ఆడుదాం ఆంధ్ర ర్యాలీ ప్రారంభించిన సబ్ కలెక్టర్
December 23, 2023
0
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం పై శనివారం మున్సిపల్ కమిషనర్ ఎస్ మనోహర్ ఎంపీడీవో విజయ శేఖర్ విద్యార్థులచే కలిసి ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఆర్డిఓ కార్యాలయంలో ఆడుదాం ఆంద్ర ర్యాలీని సబ్ కలెక్టర్ విద్యాదరి జండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముందుగా సచివాలయ స్థాయిలో కబడ్డీ, వాలీబాల్ కోకో లాంటి ఆటలు ఆడిస్తారని గెలుపొందిన వారికి జిల్లాస్థాయిలో ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో ఆడిస్తారని తెలిపారు. అనంతరం ర్యాలీలో అధికారులు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమ ప్రత్యేకత గురించి స్థానికులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ సుబ్బారెడ్డి సహాయ వ్యవసాయ సంచాలకులు పి అనసూయ, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

