అంగన్వాడీల సమ్మెకు బిటిఏ మద్దతు

0

స్థానిక సిడిపిఓ కార్యాలయం వద్ద తమ సమస్యల పరిష్కారానికి అంగన్వాడీలు నిర్వహిస్తున్న సమ్మెకు మంగళవారం బిటిఎ ఉపాధ్యాయ సంఘం సంఘీభావం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు కే మోహన్ రావు మాట్లాడుతూ అంగన్వాడీల సమ్మెకు అండగా ఉంటామని మీ సమస్యలు పరిష్కారం చేయాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం అన్నారు. ఈ ప్రభుత్వం ఉద్యోగస్తులపై కక్షగడుతుందని, నిర్బంధాన్ని ప్రయోగిస్తుందని తెలిపారు. అంగన్వాడీలు ప్రభుత్వం ఎంత నిర్బంధం పెట్టిన వారి సమస్యల కోసం పోరాటం చేస్తున్నారని అన్నారు. అంగన్వాడీల సమ్మెకు  ఆర్థికంగా సహకారాన్ని అందించారు. అనంతరం అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని ఖాళీ ప్లేట్లు తో



శిబిరం వద్ద నుండి పోస్ట్ ఆఫీస్ సెంటర్ వరకు నిరసన ర్యాలీ జరిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ అధ్యక్ష కార్యదర్శులు ఎస్కే రహంతున్నీసా, రాజేశ్వరి, ప్రభావతి, శంషాబాద్, అనురాధ, రాధ, సిఐటియు ఎస్ఏ గౌస్ అంగన్వాడీ ఆయాలు, టీచర్లు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)