పట్టణంలోని 20వ వార్డులో బాబు షూరిటీ - భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ కందుకూరు నియోజకవర్గ ఇంచార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు చేపట్టారు. మొదటగా వెంకటనారాయణ బజార్ లోని జహంగీర్ మాలాంగ్ దర్గాలో ముస్లిం మత పెద్దలచే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ పార్టీ మినీ మేనిఫెస్టోను వివరించారు. నాగేశ్వరావు మాట్లాడుతూ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ ఖాతాలో నెలకు 1500 రూపాయలు జమ చేస్తాం అని, తల్లికి వందనం పథకం కింద ప్రతి ఇంట్లో చదివే పిల్లలందరికీ, ఒక్కొక్కరికి ఏడాది 15 వేల రూపాయలు అందిస్తాం అని, ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచిత పంపిణీ,
మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం, యువత కోసం 15 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడంతో పాటు ప్రతినెల 3 వేల రూపాయలు చొప్పున నిరుద్యోగ భృతి, అన్నదాతలకు ప్రతి ఏటా 20 వేల రూపాయల ఆర్థిక సహాయం, పేదలు ఆర్థికంగా ఎదిగేలా పూర్ టు రిచ్ పథకం అమలు, ప్రతి ఇంటికి కుళాయి ద్వారా మంచినీరు తదితర అంశాలను తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన మేనిఫెస్టోను తెలిపారు. రాబోయే తెలుగుదేశం ప్రభుత్వంలో పేదలందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. అర్హులందరికీ అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందిస్తామన్నారు. మీకు ఎలాంటి బెదిరింపులు వచ్చినా తమకు తెలియజేయాలని, తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తూ, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన జగన్మోహన్ రెడ్డిని ఓడించాలంటే, తెలుగుదేశం పార్టీకి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రాబోయే ఎన్నికల్లో కందుకూరులో తనను ఆశీర్వదించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, పట్టణ ప్రధాన కార్యదర్శి ముచ్చు శీను, వార్డు నాయకులు నజీర్, షాకీర్, జిలాని, బాజీ, మునీర్ జిబిరుల్ల, కరిముల్లా, నవీద్, రబ్బాని , అమీరుల్లా వలేటి వెంకటేశ్వర్లు పార్టీ నాయకులు, చిలకపాటి మధు, షేక్ రఫీ, బెజవాడ ప్రసాద్, మోదడుగు వెంకటేశ్వర్లు, షేక్ మున్నా, చుండూరి శీను, ముచ్చు వేణు, షేక్ సలాం, సవిడిబోయిన వెంకటకృష్ణ, షేక్ రూబీ సయ్యద్ గౌస్ బాషా, షేక్ కరిముల్లా, జియావుద్దీన్, షేక్ ఫిరోజ్, ఫాజిల్, షేక్ ఖలీల్, షేక్ మమ్ముషా, కాలేషా, వలి భాష, రసూల్, గుమ్మా శివ, చవళం కేశవులు ఇతర నాయకులు పాల్గొన్నారు.


.jpg)
