అమ్మవారి ఆశీస్సులు కూటమి ప్రభుత్వానికి ఉండాలి : రాపురి కోటేశ్వరమ్మ

0

అమ్మవారి ఆశీస్సులు కూటమి ప్రభుత్వానికి ఉండాలి : రాపురి కోటేశ్వరమ్మ

BSBNEWS - PONNALURU

పొన్నలూరు : తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే తామంతా వచ్చి బెజవాడ కనకదుర్గమ్మ సేవ కోసం విజయవాడ వచ్చి మోక్కులు తీర్చుకుంటామని ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను మండలంలోని నాగిరెడ్డి పాలెం గ్రామానికి చెందిన ఎస్టి కాలనీవాసులు నేడు  బెజవాడ కనకదుర్గమ్మ ఆశీస్సుల కోసం బయలుదేరారు. వివరాల్లోకి వెళితే గత కొన్ని సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న నాగిరెడ్డి పాలెం ఎస్టీ కాలనీ అనుమోలు సాంబశివరావు ఆధ్వర్యంలో టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీ దామచర్ల సత్య సహకారంతో రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మీద అభిమానంతో వారు నేడు ఎస్టీ కాలనీవాసులందరూ కనకదుర్గమ్మ ఆశీస్సుల కోసం బయలుదేరడం,  ఆ తదనంతరం చంద్రబాబు నాయుడు,  రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామికి అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలకు అండగా నిలుస్తూ ప్రజారంజక పాలన అందించాలని వారు కోరుతూ వారు యాత్ర ప్రారంభించారు. మండల పార్టీ అధ్యక్షులు అనుమోలు సాంబశివరావు వారి యాత్రకు జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్టీ సెల్ ఒంగోలు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి రాపూరి కోటేశ్వరమ్మ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన స్వామి గారు అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసే విధంగా పరిపాలన చేయాలని అలానే పొన్నలూరు మండలంలో అసంపూర్తిగా ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజల మన్ననలు పొందే విధంగా ప్రణాళిక చేయాలని కోరుతున్నామన్నారు. ముఖ్యంగా గ్రామాల్లో తాగునీరు, డ్రైనేజ్ వ్యవస్థ, మెరుగుపరచి నియోజకవర్గ ప్రజలకు అండగా నిలవాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు కంటు గోపి, గుమ్మల వెంకట్రావు, కుర్రపాటి సురేంద్ర, సర్పంచ్ కొర్రపాటి మమత, దాసరి కొండలరావు తోపాటు పలువురు నాయకులు హాజరయ్యారు

Post a Comment

0Comments
Post a Comment (0)