డ్వామా అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష
BSBNEWS - KANDUKUR
*స్థానిక డ్వామా కార్యాలయంలో కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు శనివారం డ్వామా అధికారులు, ఇంజనీరింగ్ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖల సమీక్షలో భాగంగా, డ్వామా కార్యాలయానికి వెళ్లిన ఎమ్మెల్యే కి అధికారులు స్వాగతం పలికారు. శాలువాతో సత్కరించారు. ప్రధానంగా ఉపాధిహామీ పథకానికి సంబంధించి గతంలో చేసిన పనులు, పురోగతి వివరాలను ఈ సందర్భంగా ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. ఈ ఏడాదిలో చేపట్టబోయే ప్రతిపాదనలను మండలాల వారీగా అధికారులు ఆయనకు వివరించారు. రైతులకు ఉపయోగపడేలా వ్యవసాయ అనుబంధ పనులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని ఎమ్మెల్యే నాగేశ్వరరావు, ఏపీడి మృదులకు సూచించారు. గత ప్రభుత్వంలో జలకళ ద్వారా, నియోజకవర్గం మొత్తంమీద 430 బోర్లు వేయగా కేవలం ఐదింటికి మాత్రమే మోటార్లు బిగించినట్లు అధికారులు తెలిపారు. విద్యుత్ లైన్లు లేకపోవడం, కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడం వంటి కారణాలవల్ల మోటార్లు బిగించడంలో జాప్యం జరిగిందని ఎమ్మెల్యేకు వివరించారు. నూతన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత మిగతావాటి గురించి ఆలోచిద్దామని ఎమ్మెల్యే తెలిపారు. ఇంకా, ఉద్యానపంటల ఎంపిక, మొక్కల పంపిణీ, ప్రభుత్వ రాయితీలు తదితరుల అంశాలపైనా ఎమ్మెల్యే సమీక్ష చేశారు. ఈ కార్యక్రమంలో డ్వామా ఏపీడి మృదుల, ఐదు మండలాల ఏపీఓ లు, ఈసి లు, టిఎ లు, కంప్యూటర్, ఇంజనీరింగ్ సిబ్బంది తదితరులు హాజరయ్యారు.

.jpeg)

