జులై 8వ తేదీన వైయస్ రాజశేఖరరెడ్డి జయంతిని ఘనంగా జరపండి - పార్టీ శ్రేణులకు బుర్రా పిలుపు
BSBNEWS - KANDUKUR
దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి కార్యక్రమాలను నియోజకవర్గ స్థాయిలో ఘనంగా నిర్వహించాలని మాజీ శాసనసభ్యులు, కందుకూరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఇన్చార్జి బుర్రా మధుసూదన్ యాదవ్ వైఎస్ఆర్సిపి పార్టీ శ్రేణులకు ఒక ప్రకటనలో తెలియజేశారు. దివంగత నేత పరిపాలనలో ప్రజలకు అందించిన సంక్షేమాన్ని, అభివృద్ధిని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. డా|| వై.యస్.ఆర్ విగ్రహాలను ముందుగానే శుభ్రపరిచి, నూతన రంగులతో అలంకరించడంతో పాటు, ఆరోజు జయంతి రోజైన 08.07.2024 న పలు సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు సమాయత్తం కావలసిందిగా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మండల పార్టీ కేంద్రాల్లోనూ, వైయస్సార్ విగ్రహం ఉన్న ప్రతి గ్రామములోనూ జయంతి కార్యక్రమం నిర్వహించాలన్నారు. విగ్రహాలు లేని గ్రామాల్లో డాక్టర్ వైయస్సార్ చిత్రపటానికి ఘనంగా జయంతి నిర్వహించి జన్మదిన కేకును కట్ చేసి, దివ్యాంగులకు, వితంతువులకు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ఆసుపత్రుల్లో రోగులకు పాలు, పండ్లు,బ్రెడ్ లాంటి పౌష్టిక ఆహారం పంపిణీ చేయాలని కోరారు. నియోజకవర్గంలో ఉన్నటువంటి మానసిక వికలాంగుల పాఠశాలలు, వృద్ధుల ఆశ్రమాల్లో కూడా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమాల్లో కందుకూరు నియోజకవర్గ వైయస్సార్సీపి పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు,కార్యకర్తలు, అభిమానులు అందరూ విరివిగా పాల్గొని దివంగత మహానేతకు ఘనంగా నివాళులు అర్పించాలని తెలిపారు.

