ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలి - డేగా ప్రభాకర్
BSBNEWS - ఏలూరు
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలి..సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్
భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ)ఏలూరు ఏరియా జనరల్ బాడీ సమావేశం కురెళ్ళ వరప్రసాద్ అధ్యక్షతన ఆర్.ఆర్.పేట స్ఫూర్తి భవన్ నందు జరిగినది. ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్,సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. డేగా ప్రభాకర్ మాట్లాడుతూ దేశంలో దున్నే వాడికి భూమి కావాలనే నినాదంతో లక్షలాది ఎకరాల భూమిని పేద ప్రజలకు పంచిన ఘనత కమ్యూనిస్టు పార్టీ సొంతమని, కార్మిక,కర్షక పీడత ప్రజల పక్షాన నిలబడి వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కమ్యూనిస్టు పార్టీ ఉద్యమాలు, పోరాటాలు నిర్వహిస్తుందని తెలిపారు. నేడు దేశంలో,రాష్ట్రంలో అనేక హామీలను ఇచ్చి అధికారం పొందిన ప్రభుత్వాలు ప్రజల సంక్షేమం,అభివృద్ధిని సమానంగా చూడాలని తద్వారా ప్రజలందరికీ సుపరిపాలన అందించాలని హితవు పలికారు. అపరిష్కృతంగా ఉన్న ఉద్యోగ,కార్మిక సమస్యలను పరిష్కరించాలని,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్మాణం పూర్తయిన టిడ్కో ఇళ్లను తక్షణమే లబ్ధిదారులకు అందజేయాలని డిమాండ్ చేశారు. మన్నవ కృష్ణ చైతన్య మాట్లాడుతూ ఏలూరు నగరంలో కమ్యూనిస్టు పార్టీకి ఘన చరిత్ర ఉందని అందుకు అనుగుణంగా ఏలూరు నగర సమస్యల పరిష్కారంపై ఏరియా సమితి ఉద్యమ కార్యాచరణ రూపొందించాలని పిలుపునిచ్చారు. శాఖల సమావేశాలను సక్రమంగా నిర్వహించాలని, ఏరియా పార్టీని మరింత బలోపేతం చేయాలని అందుకు అవసరమైన పూర్తి సహాయ సహకారాలు అందించడానికి జిల్లా పార్టీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని తెలిపారు. బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఏలూరు నగరంలో ఎంతో మందికి జీవనోపాధి కల్పిస్తున్న జూట్ మిల్లులను మూసివేయడం దారుణమని విమర్శించారు ప్రభుత్వాలు నూతనంగా ఉద్యోగాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని, జ్యూట్ మిల్లులను తిరిగి తెరిపించాలని తద్వారా ఏలూరు నగరంలో ప్రజలకు ఉపాధి కల్పించేందుకు నూతనంగా ఎన్నికైన ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. ఏలూరు నగరంలో రోడ్లు డ్రైనేజీ వీధి దీపాలు వంటి మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని విలీన పంచాయతీల సమస్యలను పరిష్కారం చేయాలని కోరారు. ఈ సమావేశంలో సిపిఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి ఉప్పులూరి హేమ శంకర్ కార్యవర్గ సభ్యులు మావురి విజయ,అడ్డగర్ల లక్ష్మీ ఇందిరా, కొల్లూరి సుధారాణి, ఎం.ఏ హకీమ్, కౌన్సిల్ సభ్యులు భజంత్రీ శ్రీనివాస్, కొండేటి బేబి, బి కృష్ణ ప్రసాద్, రషీద్ భాజీ,ఉప్పులూరి లక్ష్మి, భవాని,జోజీ మేరీ, తులసి, కాటూరి శ్రీధర్, కొప్పిశెట్టి వెంకటపతి, మహబూబ్ షరీఫ్, గ్రంధి నాగ రవి కిషోర్, బేతా శంకర్, తదితరులు పాల్గొన్నారు.



.jpeg)